Zelensky : 150 మిలియన్‌ ఏళ్ల నాటి పురాతన సముద్ర జీవికి జెలెన్‌ స్కీ పేరు

150 మిలియన్‌ ఏళ్ల నాటి పురాతన సముద్ర జీవికి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ పేరు పెట్టారు.

Zelensky : 150 మిలియన్‌ ఏళ్ల నాటి పురాతన సముద్ర జీవికి జెలెన్‌ స్కీ పేరు

150 Million Year Old Marine Invertebrate Named After Ukraine President

150 million year old marine invertebrate Named after Ukraine President: రష్యా-యుక్రెయిన్ యుద్ధం తరువాత అధ్యక్షుడు జెలెన్‌ స్కీ పేరు మారుమ్రోగిపోతోంది. యుద్ధానికి ముందు పెద్దగా తెలియని జెలెన్ స్కీ పేరు రష్యాతో హోరా హోరీ యుద్ధం తరువాత జెలెన్కీ అంటే సుస్పష్టంగా తెలిసింది. అత్యాధునిక ఆయుధ సామగ్రి ఉన్న రష్యాతో నెలల తరబడి యుద్ధాన్ని ఎదుర్కోవటం అంటే మాటలు కాదు. అమెరికా సహాయం తీసుకుంటూ రష్యాతో తలపడటంలో ఏమాత్రం తగ్గేదేలేదంటున్నారు జెలెన్కీ. అటువంటి జెలెన్కీ పేరును 150 మిలియన ఏళ్లనాటి ఓ పురాతన సముద్ర జీవికి పెట్టారు పోలీండ్ లోని పాలియోంటాలజిస్టులు.

ఆఫ్రికాలోని ఇథియోపియాలోని అంటలో సున్నపురాయి నిర్మాణంలో ఈ వింత జీవి పూర్తి శిలాజం సురక్షితంగా ఉంది. ఇది ఒక రకమైన ‘ఈక నక్షత్రం’ (order Comatulida)అని చెబుతున్నారు శాస్త్రజ్ఞులు. సముద్రగర్భాంలో ఉండేలా సుమారు 10 పొడవాటి చేతులు, పదునైన టెన్టకిల్‌ లాంటి పంజాలను కలిగి ఉందని పరోశోధకులు వెల్లడించారు.

యుక్రెయిన్‌ స్వేచ్ఛ కోసం పోరాడటమే కాకుండా దేశాన్ని కాపాడుకునేందుకు శాయశక్తుల కృషి చేసి ప్రపంచ దేశాల ప్రశంసలందుకున్నారు యుక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమర్‌ జెలెన్‌స్కీ. మాతృభూమి రక్షణకై జెలన్‌స్కీ కనబర్చిన తెగువ ధైర్యసాహసాలకు గౌరవార్థంగా ఈ వింతజీవికి జెలెన్కీ పేరుని సూచించారు. ఆ వింత జీవికి ఆసిచిక్రినైట్స్ జెలెన్‌ స్కీ గా నామకరణం చేశారు. ఇలాంటి వితజీవులకు సమద్ర అడుగుకు చేరుకుని ఉపరితలాన్ని పట్టుకునేలా భారీగా 10 చేతులు, ఆధారంగా ఒక పంజా ఉంటాయి.

ఐతే ప్రస్తుతం ఈ వింత శిలాజం మాత్రం ఒక చేతిని కోల్పోయింది. నిజానికి ఈ వింతజీవులు చనిపోయినప్పుడూ మృదుజాలం క్షీణించి ఎముకలు, చేతులు వంటి అవయవాల సాధారణం విడిపోతాయి. కానీ ఈ శిలాజం మాత్ర విడిపోకుండా పూర్తి నమూన సురక్షితంగా భద్రపరచబడిందని పోలాండ్‌ శాస్తవేత్తలు చెబుతున్నారు. ఈ శిలాజ జీవి ఇతర జంతుకుల దాడి నుంచి బయటపడి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఐతే ఈ జీవులు మానవులకు విషపూరితం కాదు గానీ ఇతర జీవులకు విషపూరితమే అయ్యిండొచ్చని భావిస్తున్నారు.

ఇది ఆఫ్రికన్ ఖండంలో కనుగొనబడిన మొట్టమొదటి జురాసిక్ క్రినోయిడ్ ( స్టార్ ఫిష్ , పెళుసైన నక్షత్రాలు , సముద్రపు అర్చిన్లు మరియు సముద్ర దోసకాయలతో సహా అకశేరుకాల సమూహం). సజీవ బంధువులు లేని క్రినోయిడ్‌ల ఉప సమూహానికి చెందినది.