Longevity : ప్రజలకంటే రాజకీయ నాయకుల ఆయుర్దాయం 4.5 ఏళ్లు ఎక్కువట :అధ్యయనంలో వెల్లడి

ప్రజల కంటే రాజకీయ నాయకుల ఆయుష్షు ఎక్కువని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. తమ నియోజకవర్గం పరిధిలోని ప్రజల సగటు ఆయుర్దాయం కంటే రాజకీయ నాయకులు సగటున నాలుగున్నరేళ్లు ఎక్కువకాలం జీవిస్తున్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది.

Longevity : ప్రజలకంటే రాజకీయ నాయకుల ఆయుర్దాయం 4.5 ఏళ్లు ఎక్కువట :అధ్యయనంలో వెల్లడి

Politicians Live Average 4.5 Years Longer General Public Study Finds

Politicians live average 4.5 years longer general public study finds : ఎలక్షన్లు వచ్చాయంటే చాటు రాజీకీయ నాయకుల హడావిడి అంతా ఇంతాకాదు. హామీల జడివానతో ఓటర్లను తడిపి ముద్దు చేస్తుంటారు. అటువంటి రాజకీయ నేతలు ఎన్నికలు అయ్యాక అధికారం చేతికి దక్కాక పత్తా లేకుండాపోతారు. ఓటర్ల కంటికి టీవీల్లో తప్ప ప్రత్యక్షంగా కనిపించరు.అటువంటి రాజకీయ నాయకుల్ని విమర్శించటమే తప్ప ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలనే మాటే మర్చిపోయేలా మారిపోయారు ఓటర్లు. ఇదంతా పక్కనపెడితే ప్రజలు- రాజకీయ నాయకుల ఆయుష్షు విషయంలో ఓ అధ్యయనం అత్యంత ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అదేమంటే..ప్రజల ఆయుర్ధాయం కంటే రాజకీయ నేతల ఆయుర్ధాయమే ఎక్కువని తేల్చింది ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ చేసిన ఓ అధ్యయనం.

ఓటర్ల (ప్రజలు)కంటే రాజకీయ నాయకుల ఆయుష్షు మాత్రం ఎక్కువని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. తమ నియోజకవర్గం పరిధిలోని ప్రజల సగటు ఆయుర్దాయం కంటే రాజకీయ నాయకులు సగటున నాలుగున్నరేళ్లు ఎక్కువకాలం జీవిస్తున్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది.

11 దేశాల్లో అధ్యయనం..57,500మంది రాజకీయ నేతల ఆరోగ్య స్థితిగతుల పరిశీలన
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు 19వ శతాబ్దం మొదటి నుంచి ఇటీవలి వరకు 11 దేశాలకు చెందిన 57,500 మంది రాజకీయ నాయకుల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించారు. వీరిలో 40,637 మంది ఇప్పటికే చనిపోయారు. ఈ క్రమంలో వారి జీవిత కాలాన్ని.. ఆయా ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులు, ఆయుర్దాయం గణాంకాలను సేకరించి.. ఓ నివేదికను రూపొందించారు.

రాజకీయ నాయకులు కనీసం 69 ఏళ్లు జీవిస్తున్నారని తెలిపారు. ప్రజల కంటే రాజకీయ నాయకుల ఆయుర్దాయం ఎక్కువగా ఉండటమనేది దేశాలను బట్టి వేర్వేరుగా ఉన్నట్టు ఆక్స్ ఫర్డ్ నివేదిక పేర్కొంది. తమ నియోజక వర్గంలోని ప్రజల కంటే రాజకీయ నాయకులు మూడేళ్ల నుంచి ఏడున్నరేళ్ల వరకు ఎక్కువకాలం జీవిస్తున్నట్టు తెలిపింది. ఆయుష్షులో తేడా స్విట్జర్లాండ్ లో తక్కువగా మూడేళ్లు ఉండగా.. యూకే, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియాలలో 3.5 ఏళ్లు, ఆస్ట్రియా, న్యూజిలాండ్, కెనడాలలో 4 ఏళ్లు, జర్మనీలో 4.5 ఏళ్లు, ఫ్రాన్స్లో 6 ఏళ్లు, అమెరికాలో 7 ఏళ్లు, ఇటలీలో ఏడున్నరేళ్లు ఉందని నివేదిక పేర్కొంది.

మంచి ఆదాయం.. వైద్యంతో..పెరిగిన ఆయుష్షు..
సాధారణంగా రాజకీయ నాయకులకు మంచి ఆదాయం ఉండటం..ఉత్తమ వైద్యం అందే అవకాశాలు ఉండటమే వారి ఆయుష్షు ఎక్కువగా ఉండటానికి కారణమని ఆక్స్ ఫర్డ్ నివేదిక పేర్కొంది. ఈ పరిశోధనలో పాల్గొన్న ఆక్స్ ఫర్డ్ హెల్త్ ఎకనమిక్స్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ లారెన్స్ రూప్ మాట్లాడుతూ..‘సాధారణ ప్రజలు, రాజకీయ నాయకుల ఆయుర్దాయంపై మేం చేసిన అధ్యయనం ఇప్పటివరకు జరిగిన స్టడీల్లో అతి పెద్దది. 19వ శతాబ్దం, 20వ శతాబ్దం మొదటితో పోలిస్తే.. ప్రస్తుతం రాజకీయ నాయకుల ఆయుర్దాయం మరింతగా పెరిగిందని తేలింది. సమాజంలో గొప్పవారిగా వారికి ప్రత్యేక గుర్తింపు ఉండటంతో వారు ఉత్తమ జీవనం గడిపే అవకాశాలు పెరిగాయి” అని తెలిపారు.

దేశం వారీగా సగటు జీవిత అంచనా గ్యాప్..

ఇటలీ – 7.5 సంవత్సరాలు
US – 7 సంవత్సరాలు
ఫ్రాన్స్ – 6 సంవత్సరాలు
జర్మనీ – 4.5 సంవత్సరాలు
కెనడా – 4 సంవత్సరాలు
న్యూజిలాండ్ – 4 సంవత్సరాలు
ఆస్ట్రియా – 4 సంవత్సరాలు
ఆస్ట్రేలియా – 3.5 సంవత్సరాలు
నెదర్లాండ్స్ – 3.5 సంవత్సరాలు
UK – 3.5 సంవత్సరాలు
స్విట్జర్లాండ్ – 3 సంవత్సరాలు