Marilyn Monroe : మార్లిన్‌ మన్రో చిత్రం ధర రూ.1521కోట్లు..! అతి ఖరీదైన చిత్రంగా రికార్డు

ప్రపంచ ఫ్యాషన్ ఐకాన్ మార్లిన్ మన్రో.అలనాటి ప్రఖ్యాత హాలీవుడ్‌ నటి, మోడల్, గాయని మార్లిన్‌ మన్రో పెయింటింగ్ ధర రూ.1521కోట్లు..!

Marilyn Monroe : మార్లిన్‌ మన్రో చిత్రం ధర రూ.1521కోట్లు..! అతి ఖరీదైన చిత్రంగా రికార్డు

Marilyn Monroe Pic Auction

Marilyn Monroe Pic auction : మార్లిన్ మన్రో. పరిచయం అవసరం లేని యూనిక్ నేమ్. ప్రపంచ ఫ్యాషన్ ఐకాన్ మార్లిన్ మన్రో. అలనాటి ప్రఖ్యాత హాలీవుడ్‌ నటి, మోడల్, గాయని మార్లిన్‌ మన్రో. ఆమె నవ్వితే హాలీవుడ్ నవ్వింది. ఏడిస్తే ఏడ్చింది! ఆమె కొంటె చూపు చూస్తే మెలికలు తిరిగి సిగ్గుపడింది!! మార్లిన్ మన్రో… పేరుకు అర్థం తెలుసా? ‘వెన్నెల పెదవుల మీద వెలిగిన పుట్టుమచ్చ’. 1926 జూన్ 1న జన్మించిన ఆ అందాల బొమ్మ ఆగస్టు 4,1962లో ఈ లోకాన్ని వదిలిపోయింది.

Also read : Cake Slice Auction : వేలానికి 40 ఏళ్ల నాటి కేకు ముక్క ..ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఫ్యాషన్ ఐకాన్ గా పేరొందిన మార్లిన్ మన్రో వాడిన ప్రతీ వస్తువు వేలం పెట్టగా..భారీ ధరకు అమ్ముడుపోయాయి. అటువంటి మార్లిన్ చిత్రాన్ని క్రిస్టీ సంస్థ మే నెలలో వేలానికి పెట్టనుంది. పాప్‌ గాయకుడు ఆండీ వార్హోల్‌ గీసిన ఈ అరుదైన చిత్రం రూ.1521 కోట్లు పలుకుతుందని అంచనా వేస్తున్నారు నిర్వాహకులు. ఆ ధరకు ఈ చిత్రం అమ్ముడు అయిపోతే..20వ శతాబ్దంలోనే అతి ఖరీదైన చిత్రంగా చరిత్రలో నిలుస్తుందని క్రిస్టీ సంస్థ వెల్లడించింది.

హలీవుడ్‌లో బాగా ప్రాచుర్యం పొందిన జూలియన్స్ ఆక్షన్స్ సంస్థ ప్రముఖ తారలు వాడిన వస్తువులను వేలానికి పెడుతుంటుంది. ఇప్పటివరకు మన్రో వాడిన వస్తువులను వేలానికి పెట్టారు. ఇటీవలే మరికొన్ని మన్రో వస్తువులను వేలానికి పెట్టారు. వీటిలో మన్రో మాజీ భర్త జో డిమాగ్గియో ఆమెకు రాసిన ప్రేమలేఖ, ఆ తర్వాత పెళ్లి చేసుకున్న ఆర్థర్ మిల్లర్ రాసిన ప్రేమలేఖ కూడా ఉన్నాయి. డిమాగ్గియో రాసిన ప్రేమలేఖ దాదాపు 48 లక్షలు సాధించగా, ఆర్థర్ రాసిన ప్రేమలేఖ 28 లక్షలకు అమ్ముడుపోయింది.

Also read : 1984 Spider Man Comic : స్పైడర్ మ్యాన్ పుస్తకంలో ఒకే ఒక్క పేజీ ధర రూ.24 కోట్లు..!!

కాగా మార్లిన్ మన్రో జీవితమే ఓసంచలనం.ఆమె జీవితం, ఆమె వివాహాలు, వివిధ సందర్భాలలో చేసిన వ్యాఖ్యాలూ అన్నీ సంచలనాత్మకంగా ఉండేవి. నటిగా పరిణత చెంది మరెన్నో విజయాలు సాధించవలసిన తరుణంలో మార్లన్ అర్ధాంతరంగా జీవితరంగం నుంచి నిష్రమించింది. ఆమె పేదరికాన్ని ఎదిరించ గలిగింది కానీ లెక్కకు మించిన సిరి సంపదలను, పేరు ప్రఖ్యాతలనూ తట్టుకోలేకపోయింది. ఆ కెరటాల్లో వచ్చిన కల్లోలాలు ఎన్నో..ఎన్నెన్నో..!

చిన్న వయసులోనే కష్టాల దారుల నుంచి, కన్నీటి సుడిగుండాల నుంచి నడిచొచ్చిన మన్రో ఎవరి అండా లేకుండానే తనను తాను నిరూపించుకుంది. ‘అంతర్జాతీయ అందాల తార’గా మన హృదయాల్లో నిలిచిపోయింది జలతారులాంటి చిరునవ్వులతో..!