Afghanistan: ‘ప్రపంచంలోని క్రిష్టియన్లంతా అఫ్ఘానిస్తాన్ కోసం ఉపవాసాలు, ప్రార్థనలు చేయాలి’

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిష్టియన్లు ప్రార్థనలతో పాటు ఉపవాసం ఉండి అఫ్ఘానిస్తాన్ లో శాంతి కోసం ప్రార్థనలు చేయాలని పోప్ ప్రాన్సిస్ అంటున్నారు.

Afghanistan: ‘ప్రపంచంలోని క్రిష్టియన్లంతా అఫ్ఘానిస్తాన్ కోసం ఉపవాసాలు, ప్రార్థనలు చేయాలి’

Pope

Afghanistan: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిష్టియన్లు ప్రార్థనలతో పాటు ఉపవాసం ఉండి అఫ్ఘానిస్తాన్ లో శాంతి కోసం ప్రార్థనలు చేయాలని పోప్ ప్రాన్సిస్ అంటున్నారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్ లో వారాంతపు ప్రార్థనల్లో భాగంగా తీర్థ యాత్రికులు, ప్రయాణికులతో మాట్లాడిన ఫ్రాన్సిస్.. అఫ్ఘానిస్తాన్ లో జరుగుతున్న ఘటనలు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు.

గురువారం కాబూల్ ఎయిర్ పోర్టులో జరిగిన ఆత్మాహుతి దాడిని ప్రస్తావించారు. ఎవరైతే సాయం కావాలని, ప్రొటెక్షన్ కావాలని కోరుతున్నారో వారికి దగ్గరగా ఉంటానని హామీ ఇచ్చారు.

‘ఆ దేశం భవిష్యత్ పై ఆశలు కోల్పోకుండా మీరు చేస్తున్న సాయాన్ని కొనసాగించండి. శాంతి కోసం, కలిసి బతకడం కోసం ప్రార్థన చేయండి. క్రిష్టియన్లుగా మనం ఈ పరిస్థితికి కట్టుబడి ఉన్నాం. దీని కోసం ప్రతి ఒక్కరిని ప్రార్థన చేసి ఉపవాసం ఉండాలని కోరుతున్నా. ఈ సమయంలో మనం చేయాల్సింది అదే’ అని అన్నారు.

గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో అఫ్ఘాన్లతో పాటు 13మంది అమెరికన్ సైనికులు సైతం ప్రాణాలుకోల్పోయారు. తాలిబాన్లు తిరిగి అధికారం చేజిక్కించుకోవడంతో వేల కొద్దీ అఫ్ఘాన్లు ఎయిర్ పోర్టుకు చేరుకుని విమానాల్లో పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.