Power crisis: ఆస్ట్రేలియాలో విద్యుత్ సంక్షోభం.. భారత్‌‌పై ప్రభావం.. ఎందుకంటే?

ఆస్ట్రేలియా విద్యుత్ సంక్షోభం అంచున కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశంలో 65శాతం విద్యుత్ బొగ్గుతోనే ఉత్పత్తి చేస్తారు. మరో 7శాతం ఎల్ఎన్జీ ద్వారా తయారు చేస్తారు. మిగిలినది పునరుత్పాదక ఇంధనం వనరులతో ఉత్పత్తి అవుతుంది. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో బొగ్గు సరఫరాలో తీవ్రమైన అవాంతరాలు తలెత్తాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాలో క్విన్ లాండ్, న్యూ సౌత్ వేల్స్ లో భారీగా వరదలు రావడంతో ఆయా ప్రాంతాల్లో బొగ్గు గనులు ఎక్కువగా నీటితో నిండిపోయాయి.

Power crisis: ఆస్ట్రేలియాలో విద్యుత్ సంక్షోభం.. భారత్‌‌పై ప్రభావం.. ఎందుకంటే?

Power

Power crisis: ఆస్ట్రేలియా విద్యుత్ సంక్షోభం అంచున కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశంలో 65శాతం విద్యుత్ బొగ్గుతోనే ఉత్పత్తి చేస్తారు. మరో 7శాతం ఎల్ఎన్జీ ద్వారా తయారు చేస్తారు. మిగిలినది పునరుత్పాదక ఇంధనం వనరులతో ఉత్పత్తి అవుతుంది. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో బొగ్గు సరఫరాలో తీవ్రమైన అవాంతరాలు తలెత్తాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాలో క్విన్ లాండ్, న్యూ సౌత్ వేల్స్ లో భారీగా వరదలు రావడంతో ఆయా ప్రాంతాల్లో బొగ్గు గనులు ఎక్కువగా నీటితో నిండిపోయాయి. దీనికితోడు బొగ్గు సరఫరా చేసే రైల్వే లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సరఫరాలు లేక బొగ్గుతో ఉత్పత్తిచేసే సామర్థ్యంలో 25శాతం ఖాళీగా ఉంచాల్సి వస్తోంది.. దీంతో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు పెద్ద ఎత్తున ఉత్పత్తిని నిలిపేశాయి. ఫలితంగా న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో ప్రజలు అవకాశం ఉంటే ప్రతీరోజూ కొంత సేపు లైట్లు ఆర్పేయమని ఆస్ట్రేలియా ఇంధన శాఖ మంత్రి క్రిస్ బొవెన్ స్వయంగా కోరారు. సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 8గంటల మధ్యలో అవసరం లేని విద్యుత్ వస్తువులు వినియోగాన్ని నిలిపివేయాలని కోరారు.

Power Crisis: విద్యుత్ సంక్షోభం మ‌రింత తీవ్ర‌త‌రం

ఆస్ట్రేలియాలో వాణిజ్య నగరంగా పేరొందిన సిడ్నీ నగరంలో కూడా విద్యుత్ ను పొదుపుగా వినియోగించాలని ఆ ప్రభుత్వం కోరడాన్ని చూస్తే ఆస్ట్రేలియాలో విద్యుత్ సంక్షోభం కొరత తీవ్రతను తెలియజేస్తుంది. అయితే ఆస్ట్రేలియాలో బొగ్గు ఉత్పత్తిలో తలెత్తిన అవాంతరాలతో ఆ ప్రభావం భారత్ పై పడే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు, ఎల్ఎన్జీ ఎగుమతి దారుల్లో ఆస్ట్రేలియా ఒకటి. దీంతో భారత్ ఆస్ట్రేలియా నుంచి బొగ్గును సరఫరా చేసుకుంటుంది. భారత్ లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ లెక్కల ప్రకారం.. 173 పవర్ ప్లాంట్లలో 23.32 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే ఉంది. అది వాటి అవసరాల్లో దాదాపు 35శాతంకు మాత్రమే సరిపోతుంది. వీటిల్లో తొమ్మిది ప్లాంట్లు పూర్తిగా విదేశీ బొగ్గుపైనే నడుస్తాయి. ఈ నేపథ్యంలో డిమాండ్ అందుకోవడానికి రష్యా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఆస్ట్రేలియాలో బొగ్గు సంక్షోభం భారత్ పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయి.

Ap Government: ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు.. ‘బైజూస్‌’తో ఒప్పందం.. జగన్ కీలక వ్యాఖ్యలు

ఆస్ట్రేలియాలో మార్కెట్ విద్యుత్ ను ది ఆస్ట్రేలియన్ ఎనర్జీ మార్కెట్ ఆపరేట్ (ఏఈఎంవో) నియంత్రిస్తుంది. ఉత్పత్తిదారులు తమ ఖర్చు ఆధారంగా ఇక్కడ ధరను నిర్ణయిస్తారు. ఏఈఎంవోల డిమాండ్ కు సరిపడా సరఫరా ఉండేట్లు చూసుకుంటారు. బుధవారం ఏఈఎంవో మార్కెట్ ను సస్పెండ్ చేసింది. నేరుగా తానే ధరలను నిర్ణయిస్తానని, ఉత్పత్తి దారులకు ఏర్పడే నష్టాన్ని భర్తీ చేస్తానని ప్రకటించింది. ఏఈఎంవో ఈ సస్పెన్షన్ ను కచ్చితంగా ఎప్పుడు ఎత్తివేస్తందో తెలియని పరిస్థితి. మార్కెట్ నిర్దేశించిన ధరలకు అందుబాటులోకి వచ్చే వరకు ఈ సస్పెన్షన్ ఉంటుందని అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా నుంచి భారత్ బొగ్గును ఉత్పత్తి చేసుకొనే అవకాశం లేకుండా పోయింది.