పాకిస్థాన్ లో భూకంపం: భయంతో జనం పరుగులు

పాకిస్థాన్-అప్ఘానిస్థాన్ సరిహద్దులో శనివారం (ఫిబ్రవరి 2) సాయంత్రం భారీ భూప్రకంపనలు సంభవించాయి.

  • Published By: sreehari ,Published On : February 2, 2019 / 01:41 PM IST
పాకిస్థాన్ లో భూకంపం: భయంతో జనం పరుగులు

పాకిస్థాన్-అప్ఘానిస్థాన్ సరిహద్దులో శనివారం (ఫిబ్రవరి 2) సాయంత్రం భారీ భూప్రకంపనలు సంభవించాయి.

పాకిస్థాన్-అప్ఘానిస్థాన్ సరిహద్దులో శనివారం (ఫిబ్రవరి 2) సాయంత్రం భారీ భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1 గా నమోదైంది. ఉత్తర భారతంలోని ఢిల్లీ-ఎన్ సీఆర్, జమ్మూకశ్మీర్, పూంచ్ జిల్లాల్లో కూడా భూమి కంపించినట్టు భారత జియోలాజికల్ డిపార్ట్ మెంట్ (ఐఎండీ) అధికారులు తెలిపారు. సెంట్రల్ అఫ్ఘానిస్థాన్ నుంచి ఉత్తర పాకిస్థాన్ సరిహద్దులోని పర్వత ప్రాంతమైన హిందు కుష్ దగ్గర భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు చెప్పారు. భూమి ఒక్కసారిగా కంపించడంతో ఇళ్లలో నుంచి జనమంతా భయంతో బయటకు పరుగులు తీశారు.   

 

మరోవైపు ఇండోనేషియాలోని సుమత్ర ద్వీపంలో కూడా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 గా నమోదైనట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు. రెండు ఘటనల్లో ఇప్పటివరకూ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్టు ఎలాంటి సమాచారం అందలేదు. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయలేదని ఇండోనేషియా నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ (బిఎన్ పిబి) పేర్కొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.