భారీ భూకంపం: 18మంది మృతి

భారీ భూకంపం: 18మంది మృతి

భారీ భూకంపం: 18మంది మృతి

టర్కీకి తూర్పున ఉన్న ఇలాజిజ్‌ ఫ్రావిన్స్‌లోని సివ్‌రిస్‌ జిల్లాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదైరటంలె అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 18 మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఇందులో 500మందికి పైగా గాయాలపాలయ్యారు. భూకంపం ధాటికి నివాసితులు ఇళ్లు వదిలి వీధుల్లోకి పరుగెత్తారు. టర్కీ విపత్తు, అత్యవసర నిర్వహణ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం భూకంపం తర్వాత 60 ప్రకంపనలు నమోదయ్యాయి.

పొరుగు దేశాలైన సిరియా, లెబనాన్‌లో కూడా భూప్రకంపనలు సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. కూలిన భవనాలలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో టర్కీకి చెందిన కమ్యూనికేషన్ కంపెనీలు భూకంప ప్రాంతంలోని నివాసితులకు ఇంటర్నెట్‌ను అందిస్తామని, ఫోన్ కాల్స్ ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించాయి. భూకంపం దెబ్బకు అక్కడ నివసించే ప్రజలు ఆందోళనగా ఉన్నారు. భయపడుతున్నారు. 

సివ్‌రిస్‌లో భూకంపం ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంది. సుమారు 4,000 మంది జనాభా ఉన్న ఈ పట్టణం హజార్ సరస్సు ఒడ్డున ఎలాజిగ్ నగరానికి దక్షిణంగా ఉంది. ఈ ప్రాంతంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి టైగ్రిస్ నది. పురావస్తు శాస్త్రవేత్తలు దాని నీటిలో 4,000 సంవత్సరాల నాటి పురావస్తు జాడలను కనుగొన్నారు. భవనాలు పూర్తిగా కూలిపోయాయి. 1875 లో భూకంపం వచ్చిన తరువాత మళ్లీ ఇన్నేళ్లకు ఇలా భూకంపం సంభవించిందని యుఎస్‌జీఎస్ తెలిపింది.

×