క్యూబాలో పవర్ ఫుల్ భూకంపం

10TV Telugu News

క్యూబా దేశంలోని బరాకోవాలో ఇవాళ పవర్ పుల్ భూకంపం వచ్చింది. స్థానికకాలమానం ప్రకారం..ఉదయం 6:30గంటల సమయంలో క్యూబాలోని బరాకోవా ప్రాంతానికి ఆగ్నేయంగా 48 కిలోమీటర్ల దూరంలో 6.6 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్(EMSC)తెలిపింది. 2కి.మీ లోతుతో భూకంపం వచ్చినట్లు తెలిపింది. అయితే ఇప్పటివరకు ప్రాణ,ఆస్థినష్టం గురించిన వివరాలు తెలియరాలేదు,

కాగా,ప్రపంచదేశాలను వణికిస్తున్నకరోనా వైరస్ ను కట్టడిచేయడంలో క్యూబా విజయం సాధించిన విషయం తెలిసిందే. కరోనా చైన్ ను బ్రేక్ చేయడంలో విజయం సాధించిన క్యూబాలో ఇప్పటివరకు 1,437 కరోనా కేసులు నమోదుకాగా,58మరణాలు నమోదయ్యాయి. 575మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే కరోనా కష్టకాలంలో అమెరికా సహా ప్రపంచంలోని పలుదేశాలకు వెళ్లి సేవలందిస్తున్న క్యూబా డాక్టర్లపై ప్రశంసల వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే.

10TV Telugu News