అండర్ వేర్ లతో మెట్రోలో ప్రయాణం…ఎందుకో తెలుసా

  • Published By: venkaiahnaidu ,Published On : January 13, 2020 / 11:44 AM IST
అండర్ వేర్ లతో మెట్రోలో ప్రయాణం…ఎందుకో తెలుసా

ప్యాంట్లు విప్పేసి అండర్ వేర్ లతో మెట్రో రైళ్లలో ప్రయాణించారు కొంతమంది ప్రయాణికులు. అలా ప్రయాణించిన వారిలో మగవాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా ఉన్నారు. ప్యాంట్లు లేకుండా వచ్చి మెట్రో రైళ్లు ఎక్కిన వీరిని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్లు బర్ర బాదుకున్నారు. అసలు ప్యాంట్లు తీసేసి అండర్ వేర్ లతో మెట్రో రైళ్లలో ప్రయాణం ఎందుకు చేశారు? అసలు అండర్ వేర్ ల మీద మెట్రో రైళ్లలో ప్రయాణం ఏంటి? అసలు అలాంటివాళ్లను మెట్రో రైళ్లలోకి ఎందుకు రానిచ్చారు లాంటి అనేక సందేహాలు మీ మైండ్ లో కదులుతున్నాయా?

యూరప్ లోని ఒకదేశమైన చెక్ రిపబ్లిక్ రాజధాని పరాగ్వేలో 20ఏళ్లుగా “నో ప్యాంట్స్ సబ్ వే రైడ్” అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏటా ఒకరోజు ప్యాంట్లు విప్పేసి అండర్ వేర్ లతో మెట్రోలో జర్నీ చేస్తారు. ఎప్పటిలానే జనవరి 11,2020న కూడా పరాగ్వేలో ఈ యాన్యువల్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్నవారందరూ నడుము కింద కేవలం అండర్ వేర్ లతో మెట్రోలో ప్రయాణించారు. దాదాపు గంటసేపు వారు అలా ప్రయాణించారు.

ఈ ఈవెంట్ నిర్వాహకుడు తెలిపిన వివరాల ప్రకారం…ఇతర ప్రయాణికులను వాళ్లవైపు చూసేలా చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని తెలిపారు. కేవలం వాళ్ల సెల్ ఫోన్ లు మాత్రమే చూసేవాళ్లు తమ కళ్లను చుట్టుపక్కలవైపు చూసేలా చేయడమే తమ ఉద్దేశ్యమని ఈ కార్యక్రమ నిర్వాహకుడు పవెల్ మజ్తాన్ తెలిపారు. హానిలేని ఫ్రాంక్ గా న్యూయార్క్ లో ప్రారంభమైన ఇలాంటి రైడ్స్ ఇప్పుడు ప్రపంచవాప్తంగా విస్తరించాయి. ప్రతి శీతాకాలంలో లండన్,న్యూయార్క్ సిటీలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు  జరుగుతున్న విషయం తెలిసిందే.