కరోనా వైరస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • Published By: madhu ,Published On : January 29, 2020 / 02:23 AM IST
కరోనా వైరస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కరోనా వైరస్ చైనా దేశాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ బారిన పడిన వారు మృతి చెందుతుండడంతో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రతి రోజు అదనంగా 300 నుంచి 500 మందికి ఈ వ్యాధి సోకుతోందని భావిస్తున్నారు. ఇప్పటికే మృతుల సంఖ్య 56కి చేరింది. మరో 2 వేల మందికి ఈ వ్యాధి  సోకినట్లు తెలుస్తోంది. దగ్గుతో మొదలైన ఈ వ్యాధి ముదురుతూ…నిమోనియాలా తయారై..ఊపిరాడకుండా..చేసి ప్రాణాలు తీసేస్తోంది.

చైనాతో పాటు జపాన్, తైవాన్, నేపాల్, అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, కెనాడ, హాంగ్ కాంగ్, మలేషియా, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్ లాండ్ ఇతరదేశాలకు ఈ వైరస్ పాకుతోంది. దీంతో ఆయా దేశాలు అలర్ట్ అయ్యాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన వారిని క్షుణ్ణంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. చైనా దేశంలోని వుహాన్‌లో ఈ వైరస్ అధికంగా వ్యాపిస్తోంది. చైనాలో ఉంటున్న భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. 
 

ఇదిలా ఉంటే..
కరోనా వైరస్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ కరపత్రాన్ని రిలీజ్ చేసింది. అందులో వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 

* జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా..ఛాతిలో నొప్పి మొదలైన లక్షణాలు ఉంటే..వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 
* చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. జనాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వీలైనంత వరకు వెళ్లకుండ ఉండేందుకు ప్రయత్నించాలి. 
* దూర ప్రాంతాల ప్రయాణాలు వాయిదా వేసుకుంటేనే బెటర్. 

* పెంపుడు జంతువులు ఉంటే..వారికి దూరంగా ఉండాలి. 
* ఇక గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు..చలి ప్రదేశాల్లో తిరగకూడదు. 
* ఇతరలకు, అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండాలి. 

* ఇంటి పరిసరాలు, ఇంట్లో పరిశుభ్రత పాటించాలి. 
* దగ్గిన సమయంలో, తుమ్మిన్నప్పుడు చేతి రుమాలు లేదా టవల్‌లను ముక్కు, నోటికి అడ్డంగా పెట్టుకోవాలి. మాస్క్ కట్టుకోవాలి. 

Read More : కరోనా కలకలం : చైనాలో తెలంగాణ విద్యార్థులు..భయాందోళనలో పేరెంట్స్