నలుగురు రోగులను కాపాడిన గర్భిణీ కుక్క

  • Published By: madhu ,Published On : November 22, 2020 / 01:05 AM IST
నలుగురు రోగులను కాపాడిన గర్భిణీ కుక్క

Pregnant dog saves lives of 4 patients : జంతువులు విశ్వాసం చూపుతుంటాయి. యజమానిని ప్రమాదం నుంచి కాపాడి..కుక్కలు మరణించిన ఘటనలు వినే ఉంటారు. అయితే..ఓ గర్భిణీ కుక్క ప్రాణాలకు తెగించి..నలుగురు రోగులను కాపాడింది. ఈ ఘటన Russia లోని Leningrad ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో ఓ స్పెషల్ హాస్పిటల్ ఉంది. అకస్మాత్తుగా ఆసుపత్రిలో మంటలు రేగాయి.



ఈ సమయంలో Matilda పేరు గల కుక్క (గర్భిణీ) అక్కడే ఉంది. వెంటనే ప్రమాదాన్ని తన యజమానికి తెలియచేయాలని అనుకుంది. అరుపులు వేసింది. అనంతరం మంటలు చెలరేగుతున్న ఆసుపత్రిలోకి పరుగులు తీసి అరుపులతో రోగులను అలర్ట్ చేసింది. నలుగురు రోగులు సురక్షితంగా బయటకు వచ్చారు.



స్థానికులు అప్రమత్తమయ్యారు. వాలంటీర్లు Elena Kalinina, Alexander Tsinkevichలు రక్షించారు. అప్పటికే కుక్కకు గాయాలయ్యాయని, ప్రాణం కాపాడానికి ప్రయత్నిస్తున్నామని పశు వైద్యులు వెల్లడించారు. Matilda ముఖం, మెడ, ఉదరం ప్రాంతాల్లో కాలిన గాయాలున్నాయని, గర్భంలో ఉన్న పిల్లలు సజీవంగానే ఉన్నాయని fertility specialist తెలిపారు. జన్మనిచ్చిన తర్వాత..గాయాల కారణంగా వాటిని పోషించలేకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు.