Emojis Unveiled : ప్రెగ్నెంట్ మ్యాన్, మల్టీ రేసియల్ హ్యాండ్ షేక్.. కొత్త ఎమోజీలు వచ్చేస్తున్నాయ్

ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో అన్ని రంగాల్లో మార్పులొచ్చాయి. అలాగే చాటింగ్ విధానం కూడా మారిపోయింది. ఒకప్పుడు చాటింగ్ అంటే టెక్స్ట్ మెసేజీలుండేవి. ఆ తర్వాత వాట్సాప్ పుణ్యమా అని టెక్స్ట్ తోపాటు ఆడియో, వీడియో ద్వారా కూడా చాటింగ్ చేసే అవకాశం వచ్చింది. క్రమంగా టెక్స్ట్, ఆడియో, వీడియో కలిసి మూడు చేయలేని పనిని చిన్న చిన్న ఎమోజీలు చేస్తున్నాయి.

Emojis Unveiled : ప్రెగ్నెంట్ మ్యాన్, మల్టీ రేసియల్ హ్యాండ్ షేక్.. కొత్త ఎమోజీలు వచ్చేస్తున్నాయ్

Emojis Unveiled

Emojis Unveiled : ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో అన్ని రంగాల్లో మార్పులొచ్చాయి. అలాగే చాటింగ్ విధానం కూడా మారిపోయింది. ఒకప్పుడు చాటింగ్ అంటే టెక్స్ట్ మెసేజీలుండేవి. ఆ తర్వాత వాట్సాప్ పుణ్యమా అని టెక్స్ట్ తోపాటు ఆడియో, వీడియో ద్వారా కూడా చాటింగ్ చేసే అవకాశం వచ్చింది. క్రమంగా టెక్స్ట్, ఆడియో, వీడియో కలిసి మూడు చేయలేని పనిని చిన్న చిన్న ఎమోజీలు చేస్తున్నాయి. ఎమోజీ…కేవలం ఒకే ఒక్క ముక్క, అది ఒక చిన్న పదం కూడా కాదు. కానీ పెద్ద పెద్ద భావాలను వ్యక్తపరుస్తుంది.

సాధారణంగా టెక్స్ట్ మెసేజ్‌తో భావోద్వేగాలు వ్యక్తం చేయడం చాలా కష్టం. భావోద్వేగాలను ఒక్క ముక్కలో వ్యక్తం చేయడానికే ఎమోజీ ఫీచర్ వచ్చింది. ఈ ఎమోజీలను చాటింగ్ ప్రియులు ఎంత ఆదరించారంటే చాటింగ్‌ అంటేనే “పదాలు తక్కువ ఎమోజీలు ఎక్కువ” అనే ట్రెండ్ నడుస్తోంది. ఆనందంగా ఉంటే ఎమోజీ .. బాధగా ఉంటే ఎమోజీ … కోపంగా ఉంటే ఎమోజీ … ఇలా ఎమోజీల మీద ఎమోజీలు కొత్తగా పుట్టుకొస్తున్నాయి. పెరుగుతున్న ట్రెండ్ కు అనుగుణంగా టెక్నాలజీ కంపెనీలు కూడా కొత్త కొత్త ఎమోజీలను ప్రవేశపెడుతున్నాయి. వినియోగదారుల అభిరుచులు విభిన్నంగా ఉంటాయని విభిన్న రకాల ఎమోజీలను తయారు చేస్తున్నాయి.

ఎక్కువగా ఎమోజీలను వాడేవారే సమర్థవంతంగా సంభాషిస్తారని తేలింది. భావోద్వేగాలను సూటిగా తెలపడానికి ఎమోజీలు ఎంతో సాయపడతాయని అందుకే ఎమోజీలతో ఇతరులు మన వ్యక్తిత్వాన్ని బాగా అర్థం చేసుకోగలరని తేలింది. నేటి డిజిటల్ యుగంలో సంభాషణ విధానంలో ఉన్న ఒక పెద్ద ఖాళీని ఎమోజీలు పూరించాయని కమ్యూనికేషన్ నిపుణులు అంటున్నారు. ఎమోజీలతో సమర్థవంతంగా భావాలను వ్యక్తం చేయడమే కాదు, అలాంటి సందేశాలకు త్వరగా సమాధానం కూడా వస్తుందని అన్నారు.

ఇప్పటికే ఎన్నో ఎమోజీలు మన డివైజ్ లలో ఉన్నాయి. త్వరలో మరికొన్ని కొత్త, వినూత్న, ఆలోచింపజేసేవి, అర్థవంతమైన ఎమోజీలు మీ డివైజ్ లలో చేరనున్నాయి. ఐకాన్స్ వినియోగానికి అప్రూవ్ చేసే యూనికోడ్ కన్సార్టియమ్ డ్రాఫ్ట్ లిస్టు ప్రకారం కొత్త ఎమోజీల వివరాలు తెలిశాయి. శనివారం వరల్డ్ ఎమోజీ డే. లింగ, వర్ణ వివక్షలను న్యూట్రల్ చేసేలా ఈ ఎమోజీలు రూపొందించారు. దాదాపు అన్ని ఎమోజీల్లో జెండర్ న్యూట్రల్ ఆప్షన్ ఉంది. ప్రెగ్నెంట్ మ్యాన్ ఎమోజీ చాలా డిఫరెంట్ గా ఉంది. అర్థవంతంగా, ఆలోచింపజేసే విధంగా, సమానత్వం చాటేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక అందరినీ అట్రాక్ట్ చేస్తున్న మరో ఎమోజీ హ్యాండ్ షేక్స్. విభిన్న స్కిన్ టోన్స్ లో రెండు చేతులు హ్యాండ్ షేక్ చేస్తున్నట్టు ఉంది. హార్ట్ షేప్ లో ఉంది. పీకింగ్ ఐ, హోల్డింగ్ బ్యాక్ టియర్స్, సెల్యూటింగ్.. ఇతర ఎమోజీలు. అంతేకాదు 20 కొత్త ఐకాన్స్(కోరల్, ప్లేగ్రౌండ్ స్లైడ్, క్రచ్, ఎక్స్ రే, ఎంప్టీ బ్యాటరీ) ఉన్నాయి.