హాస్పిటల్స్‌లో గర్భిణీలకు Covid-19 ఉన్నా లక్షణాలు కనిపించడం లేదు – స్టడీ

హాస్పిటల్స్‌లో గర్భిణీలకు Covid-19 ఉన్నా లక్షణాలు కనిపించడం లేదు – స్టడీ

హాస్పిటల్స్‌లో జాయిన్ అయిన కరోనావైరస్ పాజిటివ్ గర్భిణీల ఆరోగ్య పరిస్థితి అదే వయస్సు ఉన్న గర్భిణీల కంటే మరింత ప్రమాదకరం. ఐసీయూలో వారు ఎదుర్కొనే పరిస్థితులు దారుణమని స్టడీ చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరిపిన 77స్టడీల ఫలితాల ఆధారంగా బ్రిటీష్ మెడికల్ జర్నల్ ఈ విషయం వెల్లడించింది.



మొత్తం 11వేల 432మంది గర్భిణీలు కొవిడ్-19 అనుమానంతో కొవిడ్ పాజిటివ్ తో హాస్పిటల్స్ లో చేరారు. వారిని ఐసీయూలో చేర్చాల్సి వచ్చినప్పుడు మామూలు వారికంటే ఎక్కువ రిస్క్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్లూ లాంటి ఇతర వైరస్‌లు సోకినా అంతే ఎఫెక్ట్. చాలా పరిస్థితుల్లో తల్లి ఉండే రోగనిరోధక శక్తి శిశువుల గుండె, ఊపిరితిత్తులను కాపాడటంలో విఫలమవుతుంది.

కరోనావైరస్ ప్రెగ్నెన్సీ సమయంలో చాలా త్వరగా అటాక్ చేయడానికి అవకాశాలు ఎక్కువ. గర్భిణీల కంటే గర్భిణీలు కాని వారిలో కంటే లక్షణాలు (జ్వరం) బయటపడటం చాలా తక్కువ. 2/3వంతు గర్బిణీలు కాని మహిళల్లో జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు హాస్పిటల్స్ లో చేరే సమయంలో కనిపించాయి.



గర్భిణీల్లో అవి చాలా తక్కువ అని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ ప్రొఫెసర్.. స్టడీ రీసెర్చర్ షకీలా తంగరతినం అంటున్నారు. 100మంది గర్భిణీల్లో కనీసం నలుగురిని కొవిడ్ లక్షణాలు కనిపిస్తుండటంతో ఐసీయూలో చేర్చడం తప్పనిసరి అవుతుంది. ‘అసలైన రిస్క్ కంటే గర్భం దాల్చే వయస్సులో ఉన్న మహిళల్లో మొత్తం రిస్క్ ఎక్కువ. గర్భిణీలనే ఐసీయూల్లో చేర్చాల్సి వస్తుంది’ అని ఆమె వెల్లడించారు.
https://10tv.in/eating-pasta-regularly-may-be-healthier-than-you-think-shows-new-study/
గర్భిణీల్లో ఎటువంటి లక్షణాలు కనిపించకుండా అప్పుడే పుట్టిన శిశువుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తుండటం పెరిగి పోయింది. కానీ, వారిలో ప్రమాద స్థాయి తక్కువే. డెత్ రేటు కూడా ఎక్కువ కనిపించడం లేదు.