ట్రంప్‌ ఒక్క రాత్రి సూట్ రూం ఖర్చు రూ.8లక్షలు.. హైదరాబాద్ హౌజ్‌లో లంచ్

ట్రంప్‌ ఒక్క రాత్రి సూట్ రూం ఖర్చు రూ.8లక్షలు.. హైదరాబాద్ హౌజ్‌లో లంచ్

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. భారత్‌కు వస్తున్నారని కేంద్రం భారీగా ఖర్చు పెడుతూ ఏర్పాట్లు చేస్తుంది. ఇదే లిస్టులో ఆయన ఒక్క రాత్రి ఉండేందుకు రూ.8లక్షలు చెల్లిస్తుంది. ఫిబ్రవరి 24న వచ్చి అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీ ప్రాంతాలను పర్యటించనున్న ట్రంప్.. పూర్తి షెడ్యూల్ కొన్ని వారాల క్రితమే ఫిక్స్ అయింది. సీఏఏ, ఎన్నార్సీ అంశాలపై ఆందోళనలు జరుగుతున్నా.. ట్రంప్‌ భద్రత విషయంలో ఎటువంటి ఆటంకాలు కలగకూడదని సందర్శించే ప్రాంతాలతో పాటు ప్రతి చోటుకు స్పెషల్ సెక్యూరిటీ రెడీ చేశారు. 

ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలో ఉన్న ఐటీసీ మౌర్య హోటల్‌లో ప్రెసిడెన్షియల్ సూట్ రూం రెడీ చేశారు. ట్రంప్ భార్యతో సహా ఈ సూట్ రూంలోనే ఉంటారు. 4వేల 600చదరపు గజాల వైశాల్యం ఉన్న గదిలో వారుంటారు. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా.. ప్రత్యేకమైన ఎంట్రన్స్, హై స్పీడ్ లిఫ్ట్ సర్వీస్, ఒక్కో గదికి ఒక్కో సెక్యూరిటీ కంట్రోల్ రూం, కిటికీలకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులతో ప్రతీది ఎక్స్‌ట్రా సెక్యూరిటీతో ఉంటుంది. 

President Donald Trump ITC Maurya room 8 lakhs

రూం ప్రత్యేకతలు:

ఇందులో రెండు గదులతో పాటు ఓ పెద్ద లివింగ్ రూం ఉటుంది. నెమలి డిజైన్‌తో 12మందికి సరిపడ ప్రైవేట్ డైనింగ్ రూం. ఓ చిన్న స్పా. ఆవిరితో స్నానం చేయడానికి సరిపడ స్నానపు గదులు, జిమ్ సదుపాయాలు ఉన్నాయి. బిజినెస్ కోర్ట్ యార్డ్, ఓ లాంజ్, ప్రైవేట్ బోర్డ్ రూం‌లు కచ్చితంగా ఏర్పాటు చేస్తారు. 

President Donald Trump ITC Maurya room 8 lakhs1.jpg

గోడలపై డెకరేషన్స్:

గోడలపై అర్థ శాస్త్ర నుంచి తయ్యబ్ మెహతా పెయింటింగ్‌లు సంప్రదాయకమైన టచ్ ఇస్తున్నాయి. లగ్జేరియస్ గాజు సామాను విల్లేరేయో, బోచ్ క్రాకరీ, క్రిస్టల్ డే పారిస్ గ్లాస్‌వేర్ నుంచి తెచ్చిన సామాను అద్భుతమైన లుక్ ఇస్తాయి. గతంలో ఈ గదిలో దలై లామా, బిల్ క్లింటన్, జార్జ్ బుష్, టోనీ బ్లెయిర్, వ్లాదిమీర్ పుతిన్, కింగ్ అబ్దుల్లా, బ్రునోయ్ సుల్తాన్‌లు ఉన్నారు. 

President Donald Trump ITC Maurya room 8 lakhs

డొనాల్డ్ ట్రంప్ కోసం.. ప్రత్యేకమైన ఫుడ్:
ఐటీసీ మౌర్య ట్రంప్ నుంచి ఇంప్రెషన్ సంపాదించడానికి ప్రతీ అంశంలోనూ ప్రత్యేకత చూపిస్తుంది. ముందుగా ఇద్దరితో సాంప్రదాయబద్ధంగా స్వాగతం చెబుతారు. డెకరేషన్స్ మధ్యలో ప్రత్యేకమైన పూలతో రంగోలీ ఏర్పాటు చేశారు. స్వాగతంలో ఏనుగు కూడా ఓ భాగం అవుతుందని సమాచారం. ఇది కేవలం భారత సాంప్రదాయం మాత్రమే కాదు.. రిపబ్లికన్ పార్టీకి కలిసొచ్చే చిహ్నంగా ఉంటుందని ఇలా ప్లాన్ చేశారు. 

వీటితో పాటు ట్రంప్ భారత హోటల్ బుఖారాలోనూ భోజనం చేసి అక్కడ ప్రత్యేకమైన దాల్ బుఖారాను రుచి చూస్తారు. ట్రంప్ కోసం వీఐపీలకు చేసే వంటలన్నీ రెడీ చేస్తున్నారు. పిప్పళ్లు కారణంగా ట్రంప్ స్వీట్ తినడం మానేయడంతో భారత స్వీట్లను ఆ లిస్ట్ లో చేర్చలేదు. గతంలో బరాక్ ఒబామా, బిల్ క్లింటన్‌ల కోసం ప్రత్యేకమైన వంటకాలు తయారుచేశారు. 

President Donald Trump ITC Maurya room 8 lakhs

ఇవన్నీ ఏర్పాట్లతో పాటు హోటల్ కిచెన్ లో కొత్త స్టాక్ వచ్చి చేరింది. డైట్ కోక్, చెర్రీ వెన్నెలా ఐస్ క్రీమ్ లు తీసుకొచ్చారు. ప్రెసిడెంట్ ఫేవరేట్ ఫుడ్‌లు కాబట్టి ముందు అవి కచ్చితంగా ఉంచుతున్నారు. 

President Donald Trump ITC Maurya room 8 lakhs

సందర్శించే ప్రాంతాలు:

ట్రంప్.. అహ్మదాబాద్‌లో ల్యాండ్ అయి ప్రధాని మోడీని కలుస్తారు. ఇద్దరూ కలిసి సబర్మతీ ఆశ్రమానికి వెళ్తారు. ఆ తర్వాత న్యూ సర్దార్ పటేల్ స్టేడియం చూస్తారు. పది లక్షల మంది అభిమానులు వేచి చూస్తారని ఆశిస్తున్న ట్రంప్‌కు భారీగా జనం స్వాగతం చెబుతారు. అప్పుడు ఆగ్రా వెళ్లి తాజ్‌మహల్‌ సందర్శిస్తారు. 

ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి భవన్ వేదికగా బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తారు. హైదరాబాద్ హౌజ్‌లో మోడీతో కలిసి లంచ్ చేస్తారు. ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ హోస్ట్‌గా సాయంత్రం సమయంలో విందు పూర్తి చేస్తారు.