ట్రంప్ నా శత్రువు కాదు, విజయోత్సవ సభలో బైడెన్

  • Published By: madhu ,Published On : November 8, 2020 / 08:08 AM IST
ట్రంప్ నా శత్రువు కాదు, విజయోత్సవ సభలో బైడెన్

President-Elect Joe Biden Addresses The Nation : ట్రంప్ తన శత్రువు కాదని, అమెరికా అభివృద్ధి కోసం రిపబ్లికన్లతో కలిసి పనిచేస్తామని బైడెన్ ప్రకటించారు. రిపబ్లికన్, డెమొక్రాట్ల మధ్య తేడా చూపబోమని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్ష సింహాసనం బైడెన్ నే వరించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ సంచలనం విజయం సాధించాడు.



ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభలో బైడెన్ ప్రసంగించారు. జోబైడెన్ మొట్టమొదటి సారి డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. భవిష్యత్ కోసమని అమెరికన్లు ఓటు వేశారని, 7.4 కోట్ల మంది మనకు ఓటు వేశారని చెప్పారు. పూర్తి అధిక్యంతో గెలిచామన్నారు. అమెరికన్ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని, అమెరికా చరిత్రలో ఇదో రికార్డన్నారు.



ఈ గెలుపు అమెరికన్ల విజయమని అభివర్ణించారు. ప్రజలు ఆశించిన పాల అందిస్తానని మరోసారి హామీనిచ్చారు. కరోనా పరిస్థితుల్లో ముందుకొచ్చి గెలిపించిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక నుంచి అమెరికాలో ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, అమెరికా అభివృద్ధి కోసం పని చేసేందుకు సిద్ధమని బైడెన్ ప్రకటించారు.



284 సీట్లలో బైడెన్ గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ 270 దాటేశారు. డొనాల్డ్ ట్రంప్ 214 సీట్లకే పరిమితమయ్యారు. 46 వ అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఏ అధ్యక్షుడికి కూడా అన్ని ఓట్లు రానంతగా బైడెన్ పట్టం కట్టారు. రిపబ్లిక్ అభ్యర్థి ట్రంప్ పై బైడెన్ భారీ విజయాన్ని సాధించారు. పెన్సిల్వేనియాలో 20 ఎలక్టోరల్ ఓట్లు సాధించి 270 మార్క్ దాటారు. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆఖరి వరకు ముఖ్యంగా ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్నా సందర్భంలో కూడా ఓటింగ్ జరిగింది. రెండు వర్గాల నుంచి నిరసన ర్యాలీలు జరిగాయి.