శ్రీలంక అధ్యక్షుడు సంచలన నిర్ణయం…అర్థరాత్రి పార్లమెంట్ ర్దదు?

  • Published By: venkaiahnaidu ,Published On : March 1, 2020 / 03:01 PM IST
శ్రీలంక అధ్యక్షుడు సంచలన నిర్ణయం…అర్థరాత్రి పార్లమెంట్ ర్దదు?

శ్రీలంకలో ఆదివారం(మార్చి-1,2020)అర్థరాత్రి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి పార్లమెంటును రాజపక్సే రద్దు చేయనున్నారని సీనియర్ మంత్రులు చెబుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి పార్లమెంటును రద్దు చేసి, షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలకు వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 2020 లో ఎన్నికలు జరగాల్సి ఉన్నా సరే, ముందస్తు ఎన్నికలవైపే రాజపక్షే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

వీటికి సంబంధించిన ఉత్తర్వులను అధ్యక్షుడు రాజపక్షే ఆదివారం అర్ధరాత్రి జారీ చేస్తారని ఓ సీనియర్ మంత్రి వెల్లడించారు. సెప్టెంబర్-1,2015న ప్రస్తుత పార్లమెంట్ అపాయింట్ అయింది.  2015 జనవరి నుంచి 2019 నవంబర్ వరకు ప్రధానిగా చేసిన రణిల్ విక్రమ సింఘేపై జరిగిన తిరుగుబాటు కారణంగా గోటబయ రాజపక్సే తన తమ్ముడైన మహీంద్ర రాజపక్సేను గతేడాది డిసెంబర్ లో ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా నియమించారు.

షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 2020 లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉన్నా సరే, రాజపక్సే ముందస్తు వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 19ఏ సవరణ చట్టం ప్రకారం పార్లమెంటుకు ఎక్కువ అధికారాలిచ్చి, అధ్యక్షుడి అధికారాలను తగ్గించింది. అయితే ప్రస్తుతం శ్రీలంక రాజకీయాలను అధ్యక్షుడి హోదాలో రాజపక్సే నడుపుతున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 19ఏ ప్రకారం అధ్యక్షుడికి అధికారాలు తక్కువ.

దీంతో నేరుగా పార్లమెంటును రద్దు చేసి, ఎన్నికలకు వెళితేనే బాగుంటుందని రాజపక్సే కృత నిశ్చయంతో ఉన్నారని సమాచారం. పార్లమెంటు రద్దు అయిన సందర్భంలో మార్చి 12-16 నుంచి నామినేషన్లు స్వీకరించడానికి ఏర్పాట్లు చేస్తామని ఎన్నికల కమిషన్ చైర్మన్ మహీంద దేశప్రియ తెలిపారు