అమ్మకానికి ట్రంప్ హెలికాఫ్టర్.. ధర ఎంతంటే?

  • Published By: vamsi ,Published On : November 9, 2020 / 07:35 AM IST
అమ్మకానికి ట్రంప్ హెలికాఫ్టర్.. ధర ఎంతంటే?

Trump:ఆల్మోస్ట్ అమెరికా అధ్యక్ష పదవి దూరమై, వైట్ హౌస్ నుంచి దూరం అయ్యే పరిస్థితి వచ్చేసింది. జో బైడెన్‌పై ప్రెసిడెంట్ ఎలక్షన్‌లో ఓడిన ట్రంప్.. ఇక పదవి కోల్పోయి సాధారణ వ్యక్తిగా మారిపోబోతున్నారు. ప్రైవేట్ జెట్స్, హెలికాప్టర్స్ ఎక్కువగా వాడే వ్యక్తుల్లో ఒకరైన ట్రంప్ దగ్గర Boeing 757 విమానం కూడా దీనినే ఇటీవలికాలంలో ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం తరచుగా ఉపయోగించారు.



అయితే ట్రంప్ దగ్గర ఒక Cessna Citation X మరియూ మూడు Sikorsky S76-B హెలికాప్టర్లు ఉన్నాయి. Sikorsky S76-B హెలికాప్టర్‌లలో ఒకదానిని ట్రంప్ ఇప్పుడు అమ్మకానికి పెట్టారు. 1997నాటి Sikorsky 76-Cని 1.6 మిలియన్ డాలర్లకు అంటే 11కోట్ల రూపాయలకు.. 2008నాటి హెలికాప్టర్‌ను 3.3 మిలియన్లకు అంటే 24కోట్లకు.. అమ్మకానికి పెట్టారు. అయితే గ్లోబలైర్.కామ్ ప్రకారం Sikorsky S76-Bని అడిగే సగటు ధర $1.395మిలియన్లు అంటే 10కోట్ల రూపాయలుగా ఉంది.



https://10tv.in/kamala-harris-has-made-history/

ట్రంప్ మాదిరిగా అమ్మాకానికి పెట్టిన ఈ ప్రత్యేక హెలికాప్టర్‌లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ట్రంప్ దానితో చాలాసార్లు ఫోటోలను పంచుకున్నారు. హెలికాప్టర్‌లో కూర్చునేందుకు ఒక ప్రత్యేకమైన అమరిక ఉంది, ప్రత్యేక డిజైన్ మరియు విలాసవంతమైన సీట్లు ఉన్నాయి. ట్రంప్ హెలికాప్టర్ సెల్ కోసం ఇచ్చిన ప్రకటన ప్రకారం, ఇది సుమారు 6,259 గంటల విమాన ప్రయాణాన్ని పూర్తి చేసింది. ట్రంప్ ప్రత్యేక లోగో హెలికాప్టర్ తోకపై కూడా ఉంటుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ ఈ హెలికాప్టర్‌ను ఉపయోగించారు.