అమెరికాలో ఉత్కంఠగా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్… బైడెన్, ట్రంప్ మధ్య స్వల్ప ఓట్ల తేడా

  • Published By: bheemraj ,Published On : November 6, 2020 / 11:01 PM IST
అమెరికాలో ఉత్కంఠగా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్… బైడెన్, ట్రంప్ మధ్య స్వల్ప ఓట్ల తేడా

America Presidential Election : అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది. బైడెన్, ట్రంప్ మధ్య స్వల్ప ఓట్ల తేడా ఉంది. బైడెన్, ట్రంప్ మధ్య 0.5 శాతం మాత్రమే ఓట్ల తేడా ఉండటంతో రీ కౌంటింగ్ జరుగుతోంది. జార్జియాలో రీ కౌంటింగ్ జరుగుతోంది.



అధ్యక్ష పీఠానికి జో బైడెన్ మరింత చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 264 ఎలక్టోరల్ ఓట్లతో ఉన్న బైడెన్ కు కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి 289 ఎలక్టోరల్ ఓట్లు వచ్చే అవకాశమున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది.



అయితే ట్రంప్ ఆశలు పెట్టుకున్న పెన్సిల్వేనియాలో బైడెన్ ఆధిక్యంలోకి వచ్చారు. అక్కడ 5587 ఓట్లతో బైడెన్ ఆధిక్యం కొనసాగుతోంది. నెవెడాలోనూ బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. ఇందులో ఏ ఒక్కటి గెలిచినా బైడెన్ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది.



214 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ట్రంప్.. ప్రస్తుతం నార్త్ కరోలినా, అలెస్కాలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం ఐదు రాష్ట్రాలు తన ఖాతాలో వేసుకుంటేనే ట్రంప్ గెలిచే అవకాశాలు ఉన్నాయి.