Prince Charles: బ్రిటన్ రాజుగా ప్రిన్స్ చార్లెస్.. క్వీన్ ఎలిజబెత్ వారసుడిగా ఎంపిక

క్వీన్ ఎలిజబెత్ తర్వాత బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు ఆమె పెద్ద కుమారుడు ప్రిన్స్ ఛార్లెస్. ఆయన వయసు 73 సంవత్సరాలు. అదిపెద్ద వయసులో ఈ బాధ్యతలు స్వీకరించబోతున్నారు ప్రిన్స్ ఛార్లెస్.

Prince Charles: బ్రిటన్ రాజుగా ప్రిన్స్ చార్లెస్.. క్వీన్ ఎలిజబెత్ వారసుడిగా ఎంపిక

Prince Charles: క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు ప్రిన్స్ ఛార్లెస్. రాజవంశ నిబంధనల ప్రకారం ప్రిన్స్ ఛార్లెస్ ఇకపై బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరిస్తారు. బ్రిటన్‌కు అత్యధిక కాలం రాణిగా కొనసాగిన క్వీన్ ఎలిజబెత్ గురువారం మధ్యాహ్నం మరణించిన సంగతి తెలిసిందే.

BiggBoss 6 Day4: బిగ్‌బాస్.. నాలుగో రోజు.. ఇలాంటి వాళ్ళ మధ్య ఉండలేను పంపించండి అంటూ.. రేవంత్ హడావిడి..

బ్రిటన్ రాజవంశ నిబంధనల ప్రకారం.. రాజు లేదా రాణి మరణిస్తే వారి వారసుల్లో మొదటి స్థానంలో ఉన్నవారు రాజు లేదా రాణిగా బాధ్యతలు స్వీకరించాలి. దీని ప్రకారం.. క్వీన్ ఎలిజబెత్-2 వారసుడిగా మొదటి స్థానంలో ఉన్నాడు ఆమె పెద్ద కుమారుడు ప్రిన్స్ ఛార్లెస్. ఇప్పటివరకు ప్రిన్స్‌గా ఉన్న ఛార్లెస్.. ఇకపై కింగ్ ఛార్లెస్‌గా మారుతారు. ప్రస్తుతం ఆయన వయసు 73 సంవత్సరాలు. ఆయన ఈ బాధ్యతలు స్వీకరిస్తే కింగ్ ఛార్లెస్-3 అవుతారు. బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరించేందుకు ప్రిన్స్ ఛార్లెస్ అత్యధిక కాలం వేచి చూశారు. అలాగే అత్యంత ఎక్కువ వయసులో ఈ బాధ్యతలు స్వీకరించబోతున్నది కూడా ఆయనే. ఛార్లెస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నుంచి మొదటి అధికారిక ఉత్తర్వు క్వీన్ ఎలిజబెత్ మృతికి సంతాపమే కానుంది.

Neeraj Chopra: నీరజ్ చోప్రా మరో రికార్డు.. డైమండ్ ట్రోఫీ గెలుచుకున్న తొలి భారతీయుడిగా ఘనత

రాజవంశ నిబంధనల ప్రకారం.. రాజు లేదా రాణి మరణించిన 24 గంటలలోపే కొత్త వారసుల ఎంపిక జరుగుతుంది. దీని ప్రకారం.. శుక్రవారమే ఛార్లెస్ రాజుగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. మరోవైపు రాయల్ డాక్యుమెంట్ల ప్రకారం.. బ్రిటన్ రాణి మరణానికి, అంత్యక్రియలకు మధ్య కనీసం పది రోజుల విరామం ఉండాలి. దీని ప్రకారం.. పది రోజుల తర్వాతే క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు జరుగుతాయి.