Prince William : ముందు భూమిని కాపాడండి.. స్పేస్ టూరిజంపై ప్రిన్స్ విలియమ్ అసహనం

స్పేస్ టూరిజం..(అంతరిక్ష పర్యాటకం..) పై రెండో క్వీన్ ఎలిజబెత్ మనవడు​ ప్రిన్స్ విలియమ్​ అసహనం వ్యక్తం చేశారు. స్పేస్ టూరిజంపై ఫోకస్ పెట్టిన అపర కుబేరులకు ఆయన హితవు పలికారు. ఇతర గ్రహ

Prince William : ముందు భూమిని కాపాడండి.. స్పేస్ టూరిజంపై ప్రిన్స్ విలియమ్ అసహనం

Prince William

Prince William : స్పేస్ టూరిజం..(అంతరిక్ష పర్యాటకం..) పై రెండో క్వీన్ ఎలిజబెత్ మనవడు​ ప్రిన్స్ విలియమ్​ అసహనం వ్యక్తం చేశారు. స్పేస్ టూరిజంపై ఫోకస్ పెట్టిన అపర కుబేరులకు ఆయన హితవు పలికారు. ఇతర గ్రహాలపైకి వెళ్లడం, అక్కడ బతకడం లాంటి విషయాలపై దృష్టి పెట్టడం కంటే.. ముందు భూమిని కాపాడుకోవడం, భూమి గాయాలను మాన్పించేందుకు ప్రయత్నించాలని సూచించారు.

వర్జిన్‌ గెలాక్టిక్‌, బ్లూ ఆరిజిన్‌, స్పేస్‌ ఎక్స్‌ సంస్థలు ప్రైవేట్ వ్యక్తుల రోదసి యాత్రలను చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్పేస్​ టూరిజం దిశగా రిచర్డ్​ బ్రాన్సన్​, జెఫ్​ బెజోస్​, ఎలన్​ మస్క్​ అడుగులు వేస్తున్నారు. అయితే ఈ గొప్ప బుర్రలు ఆకాశం వైపు చూడడం మానేసి.. ముందుకు నేల మీద ఫోకస్ పెట్టాలంటూ ప్రిన్స్​ విలియం ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Eyesight : మెరుగైన కంటి చూపుకోసం… తీసుకోవాల్సినవి ఏంటంటే!..

విలువైన మేధా సంపత్తిని సంపాదన కోసం కాకుండా.. సమాజ హితవు కోసం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే నెలలో సీవోపీ26 క్లైమేట్​ సమ్మిట్ జరగనుంది. ఈ నేపథ్యంలో విలియమ్​ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అంతరిక్ష యాత్రలతో స్పేస్‌ టూరిజంను అభివృద్ధి చేస్తున్న ధనికులపై మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్ గేట్స్ సైతం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘భూమ్మీద మనం ఎన్నో సమస్యలతో సతమతం అవుతుంటే, రోదసి యాత్రలపై దృష్టి పెట్టడం సరికాదు. మలేరియా, హెచ్‌ఐవీ లాంటి వ్యాధులు ఇంకా అంతం కాలేదు. వాటిని భూమ్మీద నుంచి ఎప్పుడు రూపుమాపుతామనే భావన నన్ను ఎప్పుడు వేధిస్తూనే ఉంది. ఈ సమయంలో స్పేస్‌ టూరిజంపై దృష్టి పెట్టడం సరి కాదు” అని బిల్​ గేట్స్ అన్నారు.

Insulin : మోతాదుకు మించి ఇన్సులిన్ ప్రమాదకరమే..!

ఓవైపు అపర కుబేరులు.. స్పేస్ టూరిజం మీద నమ్మకం కలిగించే దిశగా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ప్రిన్స్ విలియమ్, బిల్ గేట్స్ వంటి వారు విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. వీరి విమర్శలకు అపర కుబేరుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.