Prince William : ఇతగాడి బట్టతలకు ప్రపంచమే ఫిదా.. సెక్సీయెస్ట్ బాల్డ్ మ్యాన్‌గా ప్రిన్స్

ప్రపంచంలోనే సెక్సీయెస్ట్ బట్టతల మనిషిగా...ప్రిన్స్ విలియమ్స్ నిలిచారు.

Prince William : ఇతగాడి బట్టతలకు ప్రపంచమే ఫిదా.. సెక్సీయెస్ట్ బాల్డ్ మ్యాన్‌గా ప్రిన్స్

Prince William

sexiest bald man : ప్రపంచంలోనే సెక్సీయెస్ట్ బట్టతల మనిషిగా…ప్రిన్స్ విలియమ్స్ నిలిచారు. ఈయన బ్రిటన్ సింహాసనాన్ని అధీష్టించే వారిలో ఒకరు. ద సన్ లో వచ్చిన నివేదిక ఆధారంగా.. గూగుల్ సెర్చ్ లో వచ్చిన బ్లాగ్స్, రిపోర్ట్స్ పేజీల్లో మొత్తం 1.76 కోట్ల సార్లు ప్రిన్స్ విలియమ్స్ ను సెక్సీయెస్ట్ గా అభివర్ణించారంట. మైక్ టైసన్, జేసన్ స్నాతమ్, పిట్ బుల్, మైకేల్ జోర్డాన్ లాంటి వాళ్లను మించిపోయాడు ప్రిన్స్.

వీళ్లతో పాటు..రేసులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, డ్వేన్ జాన్సన్, బ్రూస్ విల్లీస్, విస్ డీజిల్, ఫ్లాయిడ్ మేవెదర్ కూడా ఉన్నారు. వరల్డ్ సెక్సీయెస్ట్ బాల్డ్ మేన్ గా ప్రిన్స్ విలియమ్స్ నిలిచినా..నెటిజన్లు ఒకే చెప్పడం లేదు. ప్రధానంగా..స్టాన్లీ టుస్సీ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారంట. ఇది స్టాన్లీని అవమానించడమే అవుతుందని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా..పలువురు మీమ్స్, ట్వీట్స్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు.

ప్రిన్స్ విలియమ్స్ ఇటీవలే వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తమ్ముడి భార్య మేఘన్ మెర్కిల్ రాజ కుటుంబంలోని వర్ణ వివక్షను బయటపెట్టగా..ప్రిన్స్ విలిమయ్స్ అలాంటిది ఏమీ లేదన్నారు. తమది వర్ణ వివక్ష కలిగిన ఫ్యామిలీ కాదని స్పష్టం చేశారు.