కలిసి వర్కౌట్ చేయలేమంటోన్న ప్రియాంక.. నిక్ జోడీ

కలిసి వర్కౌట్ చేయలేమంటోన్న ప్రియాంక.. నిక్ జోడీ

PRIYANKA – NICK: ప్రియాంక చోప్రా తన వర్కౌట్స్ గురించి.. సోషల్ మీడియాలో బోలెడు సార్లు చెప్పేసింది. అన్నీ మనకు తెలిసినవే అయినా నిక్ జోనస్‌తో కలిసి వర్కౌట్స్ చేయలేనని చెప్తుంది. డ్రూ బర్రీమోర్‌తో రీసెంట్‌గా జరిగిన ఇంటర్వ్యూలో ప్రియాంక తన భర్త గురించి.. క్వారంటైన్ లో ఉన్న సమయంలో తొలి రోజుల్లో ఏం జరిగిందో వెల్లడించింది.

స్టార్టింగ్ లో భర్తతో కలిసి వర్కౌట్ చేయాలనుకుని ఎందుకు కాంప్రమైజ్ అయింది. ప్రస్తుతం లండన్ లో ఉంటూ పదుల సంఖ్యలో ప్రాజెక్టులకు ఒప్పందం కుదుర్చుకున్న ప్రియాంక.. యాక్షన్ సిరీస్ లో పార్టిసిపేట్ చేయాలనుకుందట. దానికి భర్త నిక్ ను హెల్ప్ కోరింది.

ఆమె ఐడియాకు ఎగ్జైట్ అయిన నిక్.. ‘మనం కలిసి చేద్దాం. కలిసి చేయగలం. ఇధ్దరూ చేయదగిన పనే’ అని ఎంకరేజ్ చేశాడట. అలా మొదలుపెట్టిన జిమ్ ప్రాక్టీస్ గురించి ఇంకా చెప్తూ.. నేను చేసిన తప్పుల్లో అదొకటి. నిక్ తో కలిసి పోటీపడాలనుకున్నా. చివరికి కలిసి చేయలేమని అర్థమైంది. అని ప్రియాంక తన ఎక్స్‌పీరియన్స్ వివరించింది.

పోటీపడి వర్కౌట్స్ చేసిన తర్వాత ఆ కపుల్ డిసైడ్ అయ్యారట. మరోసారి కలిసి చేయకూడదని ఫిక్స్ అయిపోయారు. ప్రియాంక చాలా సందర్భాల్లో తన ఫిట్‌నెస్ జర్నీ గురించి చెప్తూనే ఉంటారు.