ఇంటర్నేషనల్ ప్లాట్ ఫాంపై అవార్డు గెలుచుకున్న ‘ఢిల్లీ క్రైం’

ఇంటర్నేషనల్ ప్లాట్ ఫాంపై అవార్డు గెలుచుకున్న ‘ఢిల్లీ క్రైం’

DELHI CRIME: ఇండియన్ వెబ్ సిరీస్‌కు అవార్డు దక్కింది. దేశం గర్వించదగ్గ స్థాయిలో అంతర్జాతీయ ప్లాట్ ఫాంపై గుర్తింపు దక్కించుకుంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఒరిజినల్ వెబ్ షో ఢిల్లీ క్రైమ్‌కు బెస్ట్ డ్రామా సిరిసీ్ గౌరవం దక్కింది. 48వ ఇంటర్నేషనల్ అవార్డుల్లో విన్నర్ అయింది.

ఈ అవార్డును డైరక్టర్ రిచీ మెహతా మహిళలందరికీ డెడికేట్ చేశారు. ఇందులో పోలీస్ రోల్ పోషించిన షెఫాలీ షా అద్భుతంగా నటించారు. ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ క్లిప్పింగ్‌ను పంచుకున్నారు.



ఇండియన్ కెనడియన్ డైరక్టర్ రిచీ మెహతా డైరక్షన్‌లో షెఫాలీ షా, రసికా దుగ్గల్, అదిల్ హుస్సైన్, రాజేశ్ తైలాంగ్ లు ప్రధానపాత్రల్లో కనిపించారు. ఈ షో మొత్తం 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్, మర్డర్ కేస్ ఆధారంగా చిత్రీకరించారు.

ఢిల్లీ పోలీస్ టీం దీనిపై ఇన్వెస్టిగేటింగ్ జరుపుతున్నట్లుగా సిరీస్ కథాంశం జరుగుతుంటుంది. కదులుతున్న బస్ లో 2012 డిసెంబర్ 16న ఫిజియోథెరఫీలో ఇంటర్న్ చేస్తున్న యువతి గ్యాంగ్ రేప్ కు గురై ఢిల్లీ రోడ్లపై వదిలేసే ఘటనను వెబ్ షోలో చూపించారు.