జూలై 4 నుంచి పబ్బులు, రెస్టారెంట్లు రీఓపెన్

ఇంగ్లాండ్ లో జూలై 4 నుంచి పబ్బులు, రెస్టారెంట్లు, హోటెల్స్ రీఓపెన్ కానున్నాయి. ఈ మేరకు యజమాన్యాలు

జూలై 4 నుంచి పబ్బులు, రెస్టారెంట్లు రీఓపెన్

ఇంగ్లాండ్ లో జూలై 4 నుంచి పబ్బులు, రెస్టారెంట్లు, హోటెల్స్ రీఓపెన్ కానున్నాయి. ఈ మేరకు యజమాన్యాలు

ఇంగ్లాండ్ లో జూలై 4 నుంచి పబ్బులు, రెస్టారెంట్లు, హోటెల్స్ రీఓపెన్ కానున్నాయి. ఈ మేరకు యజమాన్యాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా లాక్ డౌన్ నిబంధనలను మరింత సడలిస్తారని, టూ మీటర్(2 metre) రూల్ ని ఉపసంహరిస్తారని తెలుస్తోంది. దీంతో పబ్బులు, రెస్టారెంట్లు, హోటెల్స్ రీఓపెన్ కి పర్మిషన్ ఇస్తారని భావిస్తున్నారు.

కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ కారణంగా లండన్ లో ఆతిథ్య రంగం తీవ్రంగా ప్రభావితమైంది. దీంతో వీలైనంత త్వరగా ఆతిథ్య రంగాన్ని ఆదుకునే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రీఓపెన్ చేసుకునేందుకు పర్మిషన్ అడుగుతున్నారు. ఆతిథ్య రంగం(hospitality), వ్యాపారం నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని ఇదివరకే ప్రధాని చెప్పారు.

కాగా, ఒకవేళ ఆతిథ్యం రంగానికి పర్మిషన్ ఇస్తే సిబ్బంది పీపీఈ కిట్లు ధరించాల్సి ఉంటుంది. సెల్ఫ్ సర్వీస్ బఫెలను బ్యాన్ చేయాల్సి ఉంటుంది. వచ్చే వారం పబ్బులు, కేఫ్ లు, రెస్టారెంట్లు, హోటల్స్ రీఓపెన్ కి సంబంధించి ప్రధాని బోరిస్ జాన్సన్ ఓ ప్రకటన చేస్తారని వార్తలు వస్తున్నాయి. సంక్షోభంలో ఉన్న ఆర్థిక రంగాన్ని గట్టెక్కించేందుకు ఆయన పలు నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం. 2 మీటర్ సోషల్ డిస్టెన్స్ రూల్ ని ఎత్తేస్తారని తెలుస్తోంది.

పబ్బులు, రెస్టారెంట్లు, హోటల్స్ కు కొత్త మార్గదర్శకాలు:
* పబ్స్ లోకి పరిమిత సంఖ్యలో పంటర్స్ కి పర్మిషన్ ఇస్తారు.
* టేబుల్ టేబుల్ మధ్య చాలా గ్యాప్ ఉండాలి.
* బార్ టాప్స్, డోర్ హ్యాండెల్స్ ప్రతి గంటకు క్లీన్ చేయాలి.
* రెస్టారెంట్లలో పరిమిత సంఖ్యలో మాత్రడే డైనర్స్ ఏర్పాటు చేయాలి.
* హోటల్స్ లో రూమ్ బయటే ట్రేస్ ఉంచాలి.
* కస్టమర్ అనారోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తే సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండమని చెప్పాలి.
* జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్ లో ప్రత్యేక సిబ్బందిని పెట్టుకోవాలి. లోనికి ఎంతమంది వస్తున్నారో కౌంట్ చేయాలి. ఎక్కువమంది రాకుండా నియంత్రించాలి.
* వైరస్ సంక్రమణ రిస్క్ తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి.
* టేబుల్స్ లో సర్వ్ చేసే ముందు వెయిటర్స్ వారి చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

Read: కరోనావైరస్: సెకండ్ వేవ్ అంటే ఏంటి.. నిజంగా రాబోతుందా?