పుల్వామాపై కడుపుమండి : అమెరికాలో ఇండియన్స్ ఆందోళనలు

భారతీయ జెండాలను పట్టుకుని 'భారత్ మాతాకి జై' నినాదాలతో ప్రవాస భారతీయులు పాకిస్తాన్ విదేశీ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.

  • Published By: vamsi ,Published On : February 23, 2019 / 06:05 AM IST
పుల్వామాపై కడుపుమండి : అమెరికాలో ఇండియన్స్ ఆందోళనలు

భారతీయ జెండాలను పట్టుకుని ‘భారత్ మాతాకి జై’ నినాదాలతో ప్రవాస భారతీయులు పాకిస్తాన్ విదేశీ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.

పుల్వామా ఎటాక్ తర్వాత ప్రపంచంలో ఉన్న ప్రతీ భారతీయుడు పాకిస్తాన్ పై ఆగ్రహంతో రగిలలిపోతున్నారు. ఈ క్రమంలో అమెరికాలోని ప్రవాస భారతీయులు కూడా పాకిస్తాన్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టెర్రర్ ఎటాక్ లో పాకిస్తాన్ ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ అమెరికాలోని న్యూయార్క్ లో పాకిస్తాన్ విదేశీ కార్యాలయాల వద్ద ప్రవాస భారతీయులు నిరసన వ్యక్తం చేశారు. 600 మందికి పైగా ప్రవాస భారతీయులు ఆందోళనలో పాల్గొన్నారు.
Read Also: భారత్ చాలా బలంగా ఉంది: పాకిస్తాన్‌కు ట్రంప్ వార్నింగ్

భారతీయ జెండాలను పట్టుకుని ‘భారత్ మాతాకి జై’ నినాదాలతో ప్రవాస భారతీయులు పాకిస్తాన్ విదేశీ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. అలాగే పాకిస్తాన్ ముర్దాబాద్, గ్లోబల్ టెర్రర్ పాకిస్తాన్, ఎల్ఈటీ పాకిస్తాన్, “9/11 పాకిస్తాన్,” “26/11 పాకిస్తాన్, ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ అంటూ ప్లకార్డులపై రాసి ప్రదర్శించారు. “పాకిస్తాన్: ఏ టెర్రర్ నేషన్” అనే నినాదాన్ని వారు అమెరికాలోని పాకిస్తాన్ కన్సలేట్ ముందు గట్టిగా వినిపించారు. 
Read Also: గ్రే లిస్ట్ లో పాకిస్తాన్: భారత్ ప్రయత్నాలు ఫలించేనా?

ఈ కార్యక్రమం మొత్తం 600 మందితో ఫిబ్రవరి 22వ తేదీన జరగగా, అమెరికాలోని బీజేపీ సానుభూతి పరులు ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. భారత మూలాలు కలిగిన ఉత్తర అమెరికన్లు కూడా ఆందోళనతో పాల్గొని పాకిస్తాన్ పై తమ గళం వినిపించారు. మెజారిటీ అసోషియన్లు.. బీహార్, జార్కండ్ అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(BAJANA), తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్(TANA), ఈ ఆందోళనకు మద్దతు తెలిపాయి. ఫిబ్రవరి 14వ తేదీన జైష్ ఏ మొహమ్మద్ సూసైడ్ బాంబర్ ఉగ్రవాది దాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులు అయిన విషయం తెలిసిందే.
Read Also: సక్కగా వెళ్లటం లేదా : హైదరాబాదీలు కట్టాల్సిన ట్రాఫిక్ ఫైన్స్ రూ.63 కోట్లు