Russia Ukraine War: లక్ష్యాన్ని చేరుకునేవరకు ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగుతుంది.. మేము కోల్పోయేదేమీలేదు: పుతిన్

‘‘సైనిక చర్యను ప్రారంభించింది మేము కాదు. మేము దీనికి ముగింపు పలకడానికి ప్రయత్నిస్తున్నాం. మేము ఉక్రెయిన్ కు మా సైనికులను పంపడం వెనుక ప్రధాన లక్ష్యం దేశంలోని తూర్పు భాగంలో ఉన్న పౌరులను కాపాడడమే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. పాశ్చాత దేశాలు విధించిన ఆర్థిక, సాంకేతిక ఆంక్షలను రష్యా తిప్పికొట్టిందని చెప్పారు. తాము కోల్పోయింది ఏమీ లేదని, తాము ఏమీ కోల్పోబోమని వ్యాఖ్యానించారు. తమ సార్వభౌమత్వ అధికారానికి మరింత బలాన్నిస్తున్నామని చెప్పారు.

Russia Ukraine War: లక్ష్యాన్ని చేరుకునేవరకు ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగుతుంది.. మేము కోల్పోయేదేమీలేదు: పుతిన్

Russia Ukraine War

Russia Ukraine War: లక్ష్యాన్ని చేరుకునే వరకు ఉక్రెయిన్ పై తమ దేశ సైనిక చర్య కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. అలాగే, ఉక్రెయిన్ విషయంలో పాశ్చాత దేశాల తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘సైనిక చర్యను ప్రారంభించింది మేము కాదు. మేము దీనికి ముగింపు పలకడానికి ప్రయత్నిస్తున్నాం. మేము ఉక్రెయిన్ కు మా సైనికులను పంపడం వెనుక ప్రధాన లక్ష్యం దేశంలోని తూర్పు భాగంలో ఉన్న పౌరులను కాపాడడమే’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

రష్యా మద్దతు ఉన్న ఉక్రెయిన్ లోని వేర్పాటువాద ప్రాంతాలను కాపాడుకునేందుకే తాము సైనిక చర్య కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఆయా ప్రాంతాల వారు ఉక్రెయిన్ దళాలతో 2014 నుంచి పోరాడుతున్నారని చెప్పారు. 2014లో రష్యాలో క్రిమియా కలిసిన విషయం తెలిసిందే. వేర్పాటువాదులు అధికంగా ఉండే డాన్బాస్ (ఉక్రెయిన్ లోని ప్రాంతం) లోని ప్రజలను కాపాడేందుకే తాము పోరాడుతున్నామని పుతిన్ చెప్పుకొచ్చారు.

ఇది తమ విధి అని, తుది వరకు పోరాడుతూనే ఉంటాయని అన్నారు. పాశ్చాత దేశాలు విధించిన ఆర్థిక, సాంకేతిక ఆంక్షలను రష్యా తిప్పికొట్టిందని చెప్పారు. తాము కోల్పోయింది ఏమీ లేదని, తాము ఏమీ కోల్పోబోమని వ్యాఖ్యానించారు. తమ సార్వభౌమత్వ అధికారానికి మరింత బలాన్నిస్తున్నామని చెప్పారు.

Woman bites fingers: టీవీ సౌండు తగ్గించాలని చెప్పినందుకు అత్త చేతి మూడు వేళ్ళు కొరికేసిన కోడలు