Ukraine Russia War: ఉక్రెయిన్‭లోని నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనం.. తాజా ప్రసంగంలో పుతిన్

ఈ విషయంపై ఉక్రెయిన్ ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు. మరో పక్క ఉక్రెయిన్‭పై రష్యా భయంకరంగా బాంబులతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‭స్కీ స్పందిస్తూ రష్యాను రక్తపిపాసి అని సంభోదించారు. రష్యా జరిపిన తాజా దాడుల్లో 25 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఇలా ఉగ్రవాదులు మాత్రమే వ్యవహరించగలరని, పుతిన్ రక్తపిపాసి అని జెలెన్‭స్కీ విమర్శించారు.

Ukraine Russia War: ఉక్రెయిన్‭లోని నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనం.. తాజా ప్రసంగంలో పుతిన్

Putin Says 4 New Regions As Russia Annexes Ukraine Territory

Ukraine Russia War: ఉక్రెయిన్‭లోని నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనమైనట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. తాజాగా క్రెమ్లిన్‭లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఏడు నెలల ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఉక్రెయిన్‭లోని నాలుగు ప్రాంతాలను రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నాయని ఆయన వెల్లడించారు. మరో విశేషం ఏంటంటే.. ఈ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన తర్వాతనే విలీనాలు ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో పాశ్చాత్య దేశాలు సహా ఉక్రెయిన్ ప్రభుత్వంపై పుతిన్ మండిపడ్డారు. అంతర్జాతీయ చట్టాలను వారు ఉల్లంఘించారని, బలవంతంగా అక్కడి ప్రజలపై అధికారం చెలాయించారని పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై ఉక్రెయిన్ ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు. మరో పక్క ఉక్రెయిన్‭పై రష్యా భయంకరంగా బాంబులతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‭స్కీ స్పందిస్తూ రష్యాను రక్తపిపాసి అని సంభోదించారు. రష్యా జరిపిన తాజా దాడుల్లో 25 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఇలా ఉగ్రవాదులు మాత్రమే వ్యవహరించగలరని, పుతిన్ రక్తపిపాసి అని జెలెన్‭స్కీ విమర్శించారు.

BSP Supremo: ఆర్ఎస్ఎస్‭ను సాంత్వన పరిచేందుకే పీఎఫ్ఐపై నిషేధం.. బీజేపీపై మండిపడ్డ మాయావతి