Russia – Ukraine War: పుతిన్ మహిళ అయి ఉంటే యుద్ధం ఉండేది కాదు – ప్రధాని

పుతిన్ ఒకవేళ మ‌హిళ అయి ఉంటే యుక్రెయిన్‌పై యుద్ధం చేసేవాడు కాదని బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ అన్నారు. జ‌ర్మ‌నీ మీడియా సంస్థ జేడీఎఫ్‌తో మాట్లాడుతూ.. ఒక‌వేళ పుతిన్ మహిళై ఉంటే, నిజానికి కాదు.. కానీ ఒక‌వేళ అయి ఉంటే, బ‌హుశా అత‌ను యుక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లి ఉండేవాడు కాదని బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ వ్యాఖ్య‌లు చేశారు.

Russia – Ukraine War: పుతిన్ మహిళ అయి ఉంటే యుద్ధం ఉండేది కాదు – ప్రధాని

Putin

Russia – Ukraine War: పుతిన్ ఒకవేళ మ‌హిళ అయి ఉంటే యుక్రెయిన్‌పై యుద్ధం చేసేవాడు కాదని బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ అన్నారు. జ‌ర్మ‌నీ మీడియా సంస్థ జేడీఎఫ్‌తో మాట్లాడుతూ.. ఒక‌వేళ పుతిన్ మహిళై ఉంటే, నిజానికి కాదు.. కానీ ఒక‌వేళ అయి ఉంటే, బ‌హుశా అత‌ను యుక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లి ఉండేవాడు కాదని బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ వ్యాఖ్య‌లు చేశారు.

యుక్రెయిన్‌పై ఆక్ర‌మ‌ణ‌కు వెళ్ల‌డమంటే విష‌పూరిత‌మైన మ‌గ‌బుద్ధితోనే అని బోరిస్ పేర్కొన్నారు. అమ్మాయిల‌కు ఉత్త‌మ చ‌దువును అందించాల‌ని కోరుకున్నారు. ఎక్కువ మంది మ‌హిళ‌లు శ‌క్తివంత‌మైన స్థానాల్లో ఉండాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. నిజానికి యుక్రెయిన్ యుద్ధం ఆగాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని, కానీ ప్ర‌స్థుత ప‌రిస్థితుల్లో అటువంటి వాతావరణం కనిపించడం లేద‌ని అభిప్రాయపడ్డారు.

యుక్రెయిన్‌కు మ‌ద్ద‌తు ఇచ్చే అంశంలో ప‌శ్చిమ దేశాలు వ్యూహాత్మ‌కంగా కీల‌క‌మైన స్థానంలో ఉండాల‌ని పిలుపునిచ్చారు. ఎందుకంటే పుతిన్ ఎటువంటి శాంతి హ‌స్తాన్ని అందించ‌డంలేద‌ని బోరిస్ విమర్శించారు.

Read Also: పుతిన్ మలమూత్రాలు సేకరించడమే వాళ్ల పని..!