పుతిన్ రహస్య భవనం, యూ ట్యూబ్‌లో సంచలన వీడియో

పుతిన్ రహస్య భవనం, యూ ట్యూబ్‌లో సంచలన వీడియో

Putin’s palace : రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కి చెందినదిగా భావిస్తున్న రహస్య భవనానికి సంబంధించి వీడియో నెట్టింట్ట వైరల్‌గా మారింది. అప్‌లోడ్ చేసిన నాలుగు రోజుల్లోనే 6 కోట్ల మంది ఈ వీడియోను చూశారు. రష్యన్‌ రాజకీయ నాయకుడు, పుతిన్‌ విమర్శకుడు అలెక్సీ నవాల్ని ఈ వీడియోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయించారు. ప్రస్తుతం నవాల్నీ జైలులో ఉన్నా తన సన్నిహితుల ద్వారా ఈ వీడియోను యూ ట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ చేయించారు.

నల్లసముద్రం ఒడ్డున పుతిన్‌కు ఒక రహస్యభవనం ఉందనే కథనాలు 2010 నుంచే వస్తున్నాయి. 2012లో బీబీసీ సైతం ఈ భవనం గురించి ఒక కథనాన్ని ప్రచురించింది. కానీ, దీన్ని చూసినవారు ఇంతవరకూ లేరు. అయితే రష్యన్‌ పర్యావరణ కార్యకర్తలు కొందరు ఈ భవనం వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. రష్యాలోనే అతి పెద్ద, అత్యంత విలాసవంతమైన భవనంగా వారు దీన్ని అభివర్ణిస్తున్నారు. అక్షరాల10 వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ భవనాన్ని నిర్మించారని ప్రచారం జరుగుతోంది. రష్యా ప్రభుత్వ సంస్థలు ఈ భవనాన నిర్మాణానికి అవసరమైన డబ్బు సమకూర్చినట్టు నవాల్ని ఆరోపిస్తున్నారు.

నవాల్ని ఏడాది క్రితం జర్మనీలో విషప్రయోగానికి గురయ్యారు. పుతిన్‌ ప్రభుత్వమే తన పై విష ప్రయోగం చేయించినట్టు నవాల్ని ఆరోపించారు. వీటిని రష్యా సర్కారు తోసిపుచ్చింది. కొద్ది రోజుల క్రితం జర్మనీ నుంచి రష్యాకు చేరుకున్న నవాల్నిని ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేసి జైలుకు తరలించింది. నవాల్నీని విడుదల చేయాలంటూ రష్యాలో ఆందోళనలు జరుగుతున్నాయి.