Qatar To Host FIFA World Cup : బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో ఖతార్ కృషి .. కొన్నేళ్ల క్రితం ఎడారి, ఇప్పుడు ఫిఫా వరల్డ్‌కప్‌ హోస్ట్‌గా మారిన ధనిక దేశం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. 7 దేశాలుండే ఈ యూనియన్ లో ఖతార్ ఓ ప్రత్యేకం. భూతల స్వర్గాన్ని తలపించే దేశం. మిడిల్ ఈస్ట్‌లో.. మిగతా గల్ఫ్ కంట్రీస్ కూడా బాగానే అభివృద్ధి చెందాయ్. కానీ.. ఖతార్ మాత్రమే వాటిని మించి సాధించింది. ఇప్పుడు.. వాటికే గట్టి పోటీ ఇస్తోంది. ఫిఫా వరల్డ్‌కప్.. ఖతార్ సక్సెస్‌కి కొలతేమీ కాదు. కాకపోతే.. ఇలాంటి ఓ మెగా టోర్నీని కూడా సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించి.. మరోసారి తమ సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాలని చూస్తోంది. అసలు.. ఖతార్ ఈ స్థాయికి ఎలా ఎదగింది?

Qatar To Host FIFA World Cup : బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో ఖతార్ కృషి .. కొన్నేళ్ల క్రితం ఎడారి, ఇప్పుడు ఫిఫా వరల్డ్‌కప్‌ హోస్ట్‌గా మారిన ధనిక దేశం

Qatar To Host FIFA World Cup : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. సింపుల్‌గా చెప్పాలంటే యూఏఈ. ఈ యూనియన్‌లో 7 దేశాలుంటాయ్. కానీ.. వాటిలో ఒక్క ఖతార్ ఓ ప్రత్యేకం. భూతల స్వర్గాన్ని తలపించే దేశం. వరల్డ్ వైడ్ రీసౌండ్‌లో వినిపిస్తోంది ఖతార్ పేరు.  మిడిల్ ఈస్ట్‌లో.. మిగతా గల్ఫ్ కంట్రీస్ కూడా బాగానే అభివృద్ధి చెందాయ్. కానీ.. ఖతార్ మాత్రమే వాటిని మించి సాధించింది. ఇప్పుడు.. వాటికే గట్టి పోటీ ఇస్తోంది. ఫిఫా వరల్డ్‌కప్.. ఖతార్ సక్సెస్‌కి కొలతేమీ కాదు. కాకపోతే.. ఇలాంటి ఓ మెగా టోర్నీని కూడా సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించి.. మరోసారి తమ సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాలని చూస్తోంది. అసలు.. ఖతార్ ఈ స్థాయికి ఎలా ఎదగింది?

పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్లుగా.. ఖతార్ చిన్న దేశమే అయినా.. దాని పేరు మాత్రం ప్రపంచం అంచుల దాకా వినిపిస్తోంది. ఇందుకు.. క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, 1995 రెవల్యూషనే ఖతార్‌ను ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా మార్చేశాయ్. ముఖ్యంగా చమురు ఎగుమతులు ఖతార్‌లో అనేక అవకాశాలను కల్పించాయి. దాంతో.. అక్కడ వేగంగా ఆధునికీకరణ మొదలైంది. ఇక.. ప్రపంచంలోని న్యాచురల్ గ్యాస్ నిక్షేపాల్లో 10 శాతం ఖతార్‌లోనే ఉంది. ఉన్న అవకాశాలను ఒడిసిపట్టి.. బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవడంలో.. చిన్న దేశమైనా.. చాలా పెద్దగా సక్సెస్ అయింది.

Qatar To Host FIFA World Cup : ఫిఫా వరల్డ్‌కప్‌కు హోస్ట్‌గా ఖతార్ .. ఒకప్పుడు మనుషులు నివసించడానికి పనికిరాని ఆ దేశంపైనే ఇప్పుడు ప్రపంచం దృష్టి

బ్లాక్ గోల్డ్‌గా పిలిచే చమురు బావులను కనుగొన్నప్పుడు.. ఖతార్ స్వతంత్ర దేశమేమీ కాదు. 1916 నుంచి బ్రిటన్ పాలనలోనే ఉంది. అనేక సంవత్సరాల అన్వేషణ తర్వాత.. 1939లో పశ్చిమ తీరాన దోహాకు 80 కిలోమీటర్ల దూరంలో.. దుఖాన్ అనే ప్రాంతలో తొలి చమురు నిక్షేపాన్ని కనుగొన్నారు. దానిని.. పెట్టుబడిగా మార్చుకునేందుకు ఖతార్‌కు కొన్నేళ్లు పట్టింది. రెండో ప్రపంచ యుద్ధ ప్రారంభంలో ఈ చమురు నిక్షేపం బయటపడింది. అందువల్ల 1949 వరకు క్రూడ్ ఎగుమతులు జరగలేదు.. లాభాలూ రాలేదు. అభివృద్ధి చెందుతున్న చమురు పరిశ్రమకు ఆకర్షితులైన విదేశీయులు, పెట్టుబడిదారులు ఖతార్ రావడం మొదలుపెట్టారు. దాంతో.. జనాభా వృద్ధి జరిగింది. 1950లో ఖతార్ జనాభా 25 వేల కంటే తక్కువే. 1970 నాటికి లక్ష కంటే ఎక్కువ పెరిగింది. ఆ సమయంలోనే.. ఖతార్ జీడీపీ 2 వేల 445 కోట్లకు చేరింది. 1971లో అక్కడ బ్రిటీష్ పాలన ముగిసింది. ఖతార్ స్వతంత్ర దేశంగా మారింది. దాంతో.. అక్కడ కొత్త శకం మొదలైంది. ఈ మార్పు.. ఖతార్‌ను మరింత సంపన్న దేశంగా మార్చింది.

FIFA World Cup 2022: రెండు రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం.. అక్కడ బీర్ల అమ్మకాలు బంద్

1971లో ఖతార్‌ ఈశాన్య తీరంలోని నార్త్ ఫీల్డ్‌లో.. 6 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో న్యాచురల్ గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నారు. ఇది.. ఖతార్ దేశ విస్తీర్ణంలో సగానికి సమానం. అయితే.. నార్త్‌ ఫీల్డ్‌ భూమిపై ఉన్న అతి పెద్ద సహజ వాయువు క్షేత్రమని అర్థం చేసుకునేందుకు.. మరో 14 ఏళ్లు పట్టింది. ప్రపంచ నిల్వల్లో పది శాతం ఖతార్‌లోనే ఉంది. సహజ వాయువు నిల్వల్లో.. ఇరాన్, రష్యా తర్వాత ఖతార్ అతిపెద్ద దేశమని తెలిసింది. ఖతార్ గ్యాస్ కంపెనీ.. ప్రపంచంలోనే అతిపెద్ద న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తిదారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో.. ఈ కంపెనీదే కీరోల్. అయితే.. దేశంలో రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్న సమయంలోనే.. ఖతార్‌లో ఆర్థిక మార్పులు కూడా జరిగాయ్. 1995లో హమాద్ బిన్ ఖలీఫా అల్తానీ అధికారంలోకి వచ్చారు. అప్పుడే.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పు సంభవించింది. గ్యాస్, చమురును వెలికితీయడానికి చేసిన పెట్టుబడులు, వాటిని ఎగుమతి చేయడం కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు.. ఖతార్‌ను విదేశాలతో అనుసంధానించడానికి ఉపయోగపడ్డాయ్.

21వ శతాబ్దంలో ఖతార్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అమాంతం పెరిగింది. 2003 నుంచి 2004 మధ్యకాలంలో ఖతార్ జీడీపీ రేటు 3.7 నుంచి ఒక్కసారిగా 19.2 శాతానికి పెరిగింది. రెండేళ్ల తర్వాత 2006లో 26 శాతానికి ఎదిగింది. ఈ పెరుగుతున్న జీడీపీ రేటు ఎన్నో ఏళ్ల పాటు ఖతార్ కెపాసిటీ ఏమిటో.. ప్రపంచానికి చాటింది. అయితే.. గత కొన్ని సంవత్సరాల్లో ఖతార్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. మందగమనాన్ని ఎదుర్కొంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటంతో.. భవిష్యత్‌లో అనేక సవాళ్లను ఎదుర్కోనే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఖతార్‌తో ఒక దౌత్యపరమైన వివాదం తర్వాత సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఈజిప్టు దేశాలు 2017 నుంచి 2021 వరకు నిషేధం విధించాయి. ఇది ఖతార్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా నిలిచింది.

Deliver Food Order: ఫుడ్ డెలివరీ చేసేందుకు సాహసం…. 30,000 కిలోమీటర్లు ప్రయాణించి, నాలుగు ఖండాలు దాటిన యువతి

చమురు, సహజ వాయువు తప్ప ఖతార్ మిగతా మార్గాల్లో ఆదాయ వనరులను సమకూర్చుకోలేదు. అందువల్ల.. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్‌ని విస్తరించాలనుకుంటున్నారు. హైడ్రో కార్బన్‌లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి వీలుగా ప్రైవేటులో పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే.. లండన్, న్యూయార్క్ లాంటి నగరాల్లో ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఖతార్ ఫండ్ సంస్థలు అనేక ప్రాపర్టీలను కలిగి ఉన్నాయి. అంతేకాదు.. తమ రాజధాని దోహాను.. ఇంటర్నేషనల్ ఈవెంట్‌లు, కాన్ఫరెన్స్‌లు, మీటింగ్‌లకు హబ్‌గా మార్చడంపైనా.. అక్కడి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పుడు.. ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ కోసం కొత్తగా ఓ ఎయిర్‌పోర్టు, కొత్త మెట్రో లైన్ లాంటివి నిర్మించడం కూడా ఇందులో భాగమే. అయితే.. ఫిఫా వరల్డ్‌కప్ బిడ్ దక్కించుకునేందుకు.. ఖతార్ లంచం ఇచ్చిందనే ఆరోపణలు వచ్చాయి. ఇంకా.. చాలా విమర్శలున్నాయి. కానీ.. వాటన్నింటిని ఎదుర్కొంటూ.. ఓ చిన్న దేశమైన ఖతార్.. ఫిఫా వరల్డ్ కప్ టోర్నీకి.. విజయవంతంగా ఆతిథ్యం ఇస్తోంది. తన పేరును.. మరోసారి ప్రపంచవ్యాప్తంగా మార్మోగేలా చేసింది.