Queen Elizabeth : మేడమ్ టుస్సాడ్‌ మ్యూజియంలో .. 23రకాల క్వీన్ ఎలిజబెత్‌ బొమ్మలు

లండన్‌లోని మేడమ్ టుస్సాడ్‌ మ్యూజియంలో..ఎలిజబెత్‌ బొమ్మలు ఒకటీ రెండూ కాదు ఏకంగా 23రకాల ఎలిజబెత్ బొమ్మలు ఉన్నాయ్.

Queen Elizabeth : మేడమ్ టుస్సాడ్‌ మ్యూజియంలో .. 23రకాల క్వీన్ ఎలిజబెత్‌ బొమ్మలు

23 types of Elizabeth statues in Madame Tussauds Museum

23 types of Elizabeth statues in Madame Tussauds Museum : క్వీన్ ఎలిజబెత్ తన 70 ఏళ్ల పాలనాకాలంలో ప్రపంచంలోని ప్రతీ దేశంలోనూ పర్యటించారు.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 17లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేశారామె. అంటే భూమిని 42సార్లు చుట్టేసినంత దూరం అన్నమాట ! ఇక ప్రపంచవ్యాప్తంగా వెలుగుచూసిన ఎన్నో పరిణామాలకు, ఆవిష్కరణకు ప్రత్యక్ష సాక్షి క్వీన్ ఎలిజబెత్‌. ఆమె బొమ్మతో 35 దేశాలు కాయిన్స్‌ విడుదల చేశాయ్. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్‌ మ్యూజియంలో..ఎలిజబెత్‌ బొమ్మలు ఒకటీ రెండూ కాదు ఏకంగా 23రకాల ఎలిజబెత్ బొమ్మలు ఉన్నాయ్.

Queen Elizabeth : 13 ఏళ్లకే ప్రేమలో పడిన క్వీన్ ఎలిజజెత్ .. పట్టుదలతో ప్రేమను గెలిపించుకున్న ధీర

అలాగే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఎలిజబెత్‌ మనవడు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ మైనపు బొమ్మల ఉన్నాయి. కాగా ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ మైనపు బొమ్మలను బ్రిటన్‌ రాయల్ కుటుంబం గ్రూప్‌ నుంచి వేరు చేసింది. వారిద్దరి మైనపు బొమ్మలను హాలీవుడ్ సెలబ్రెటీల సెక్షన్‌లోకి మార్చింది. ఎందుకంటే వారు రాజ కుటుంబం నుంచి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. దీంతో వారి బొమ్మలను బ్రిటన్ రాయల్ కుటుంబం గ్రూపు నుంచి వేరు చేసి హాలీవుడ్ సెలబ్రెటీల సెక్షన్‌లోకి మార్చింది.

బ్రిటన్‌ రాజ కుటుంబానికి చెందిన క్వీన్ ఎలిజబెత్ మనుమడు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ దంపతులు ఏడాది కిందట రాజరికాన్ని వీడారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో నివాసం ఉంటున్న వీరు స్వతంత్ర జీవితం గడుపుతున్నారు. రాయల్ కుటుంబంపై ఆధారపడబోమని ప్రకటించిన ఈ దంపతులు తమ అర్జన కోసం నెట్‌ఫ్లిక్స్, స్పాటిఫై, ఆపిల్ టీవీతో కంటెంట్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు.

Queen Elizabeth : ఫ్యాషన్ ఐకాన్‌ క్వీన్ ఎలిజబెత్ .. ప్రపంచంలోనే అతి విలువైన ఆభరణాలు ఆమె సొంతం

కగా ప్రిన్స్ ఎలిజబెత్‌ మనవడు ప్రిన్స్‌ హ్యారీపై గతంలో చాలా వివాదాలే ఉన్నాయి. అవి ఎంత వరకు నిజమో తెలియదు గానీ ప్రిన్స్ హ్యారీలో చాలా మార్పులొచ్చాయంటారు ఆయన సన్నిహితులు. బహుశా వివాదాల వచ్చిన మార్పు కావచ్చు. అలా తనను తాను మార్చుకున్న ప్రిన్స్ హ్యారీ మిలటరీకి సేవలు అందించడం, జనాల్లో కలవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అమెరికన్ నటి మేగన్ మార్కెల్‌ను హ్యారీ ప్రేమించారు. రాయల్ ఫ్యామీలీ అంగీకరించి పెళ్లి చేసింది. ఐతే ఆ తర్వాత ఏం జరిగిందో కానీ.. రాజవంశపు హక్కులు వద్దు అంటూ హ్యారీ ఆ కుటుంబానికి దూరం కావడం ఆ సమయంలో వివాదంగా మారింది.