Corona virus: కరోనాకు కారణం రకూన్ జాతి కుక్కలా? అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఏం చెప్పిందంటే..

కరోనా వైరస్ చైనాలోని ల్యాబ్ నుంచి విడుదలైదని వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. వైరస్ ప్రయోగశాల నుంచి లీకైంది కాదని, ఇది ప్రకృతిలో సహజంగానే ఉత్పన్నమై ఉండవచ్చునని పేర్కొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ దినపత్రిక తెలిపింది. ముఖ్యంగా రకూన్ జాతి కుక్క నుంచి వైరస్ మనుషులకు వ్యాపించి ఉండొచ్చని అంచనా వేసింది.

Corona virus: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడించింది. ఈ వైరస్ సృష్టించిన ప్రళయానికి అనేక దేశాల్లో మృతదేహాలు గుట్టలుగా పడిపోయాయి. కోట్లాది మంది మృత్యువాత పడ్డారు. ఈ వైరస్ తొలుత చైనాలోనే వ్యాప్తి చెందడంతో అక్కడి నుంచే వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. అయితే, చైనాలోని ల్యాబ్ నుంచి ఈ వైరస్ సృష్టించబడిందని పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయాన్ని బలపర్చేలా.. వైరస్ ప్రయోగశాల నుంచి లీకై ఉండవచ్చునని అమెరికా ఇందన శాఖ అంచనా వేసింది. ఇది జరిగిన కొన్ని వారాలకే తాజాగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు వైరస్ ఎక్కడి నుంచి పుట్టిందనే విషయాన్ని వెల్లడిస్తూ నివేదికను రూపొందించారు.

Coronavirus Updates: చైనా తరువాత ఆ నాలుగు దేశాల్లో కరోనా విజృంభణ.. ఏడు వారాల్లో 30లక్షల మంది ..

అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తెలిపిన వివరాల ప్రకారం.. వైరస్ ప్రయోగశాల నుంచి లీకైంది కాదని, ఇది ప్రకృతిలో సహజంగానే ఉత్పన్నమై ఉండవచ్చునని పేర్కొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ దినపత్రిక తెలిపింది. చైనాలోని వుహాన్ చేపల మార్కెట్‌లో విక్రయించిన రకూన్ జాతి కుక్కల జన్యుపదార్థంలో కొవిడ్ కారక సార్స్‌కోవ్-2 వైరస్ ఆనవాళ్లు కనిపించాయని శాస్త్రవేత్తల బృదం పేర్కొన్నట్లు న్యూయార్క్ దినపత్రిక తెలిపింది. వుహాన్‌లోని హువానాన్ టోకు చేపల మార్క్‌ట్ నుంచి కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందిందనే అనుమానంతో చైనా అధికారులు 2020 జనవరిలో ఆ మార్కెట్‌ను మూసివేశారు. ఆ సమయంలో చైనా శాస్త్రవేత్తలు మార్కెట్ నుంచి జన్యు నమూనాలను సేకరించారు.

China Corona : బాబోయ్.. ఒక్కరోజే 3కోట్ల 70లక్షల కరోనా కేసులు, చైనాలో కోవిడ్ ఉగ్రరూపం

అయితే, రకూన్ కుక్కల నుంచే మనుషులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందిందా లేదా అన్నది శాస్త్రవేత్తలు స్పష్టంగా చెప్పలేక పోయారు. శునకాల నుంచి ఇతర జంతువులకు సోకి మనుషులకు వైరస్ వ్యాప్తి చెంది ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇదిలాఉంటే ప్రపంచంలో మొట్టమొదటి కరోనా వైరస్ కేసు చైనాలోని వుహాన్ రాష్ట్రంలో 2019లో నమోదైంది.

ట్రెండింగ్ వార్తలు