రంజాన్‌పై కరోనా ఎఫెక్ట్ : ఇంట్లోనే ప్రార్థనలు

  • Published By: madhu ,Published On : April 18, 2020 / 05:37 AM IST
రంజాన్‌పై కరోనా ఎఫెక్ట్ : ఇంట్లోనే ప్రార్థనలు

ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించేది రంజాన్ మాసం. ఉపవాసాలతో, ఖురాన్ పఠనంతో.. ప్రత్యేక నమాజులతో జరుపుకునే మాసానికి కరోనా ఆటంకం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పొంచి ఉన్న కరోనా ముప్పు ఇస్లామిక్ దేశాలను చుట్టుముట్టింది. సౌదీ అరేబియా వంటి ఇస్లామిక్ అగ్ర దేశంలోనూ ఇదే పరిస్థితి. 

కరోనా రక్కసి ప్రభావానికి సామూహిక ప్రార్థనలు వాయిదా వేసుకోవాల్సి వస్తోంది.  ప్రపంచంలోని చాలా దేశాలు కూడా మసీదులు మరియు మతానికి సంబంధించిన‌ ప్రదేశాలలో జరిగే కార్యక్రమాలను కూడా నిషేధించాయి. రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలను ఇళ్లలోనే నిర్వహించాలని.. అంతేకాకుండా కరోనా వైరస్ ఇదే స్థాయిలో ఉంటే ఈద్ ఉల్ ఫితర్ పండుగ ప్రార్థనలు కూడా ఇళ్లలోనే చదువుకోవాలని సౌదీ పత్రిక వెల్లడించింది. 

మసీదుల్లో ప్రార్థనలు చేయలేనిపక్షంలో ఇంట్లోనే చేసుకోవాలని గ్రాండ్ ముఫ్తీ షేక్ అబ్దుల్లాజీజ్ అల్ షేక్ చెప్పారు. పవిత్ర రంజాన్ మాసం వచ్చే ప్రారంభం నుంచి అవుతుంది. కానీ సౌదీ అరేబియాలో కరోనా విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇందులో వైరస్ కట్టడికి పలు ప్రయత్నాులు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. ఐదు సార్లు, శుక్రవారం జరిగే సామూహిక ప్రార్థనలను మానేశారు.

రంజాన్ సందర్భంగా సాయంత్రం అందించే ఇఫ్లార్ విందును నిషేధించారు. సౌదీ అరేబియాలో COVID-19 కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 83 మరణాలు సంభవించాయి. వైరస్ విజృంభిస్తుండడంతో దీనిని కట్టడి చేసేందుకు కర్ప్యూను నిరవధికంగా పొడిగించింది. తొలుత మూడు వారాల పాటు కొనసాగించారు.

కీలకమైన సిబ్బంది మాత్రమే సంచరించేందుకు వీలు ఉంది. నిబంధనలు ఉల్లఘించిన వారికి జరిమానాలు, జైలు శిక్ష విధించనున్నారు.