Ramming US Capitol Barrier: కారుకి నిప్పు అంటించుకుని అమెరికా క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్ళేందుకు యత్నం

కారుకి నిప్పు అంటించుకుని అమెరికా క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్ళేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. క్యాపిటల్ భవనం ముందు ఉన్న బారికేడ్ ను ఢీ కొట్టి ముందుకు దూసుకెళ్ళి, అనంతరం తుపాకీ తీసి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఇతరులు ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ఆ ఘటనపై అధికారులు పూర్తి వివరాలు తెలపలేదు.

Ramming US Capitol Barrier: కారుకి నిప్పు అంటించుకుని అమెరికా క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్ళేందుకు యత్నం

Ramming US Capitol Barrier

Ramming US Capitol Barrier: కారుకి నిప్పు అంటించుకుని అమెరికా క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్ళేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. క్యాపిటల్ భవనం ముందు ఉన్న బారికేడ్ ను ఢీ కొట్టి ముందుకు దూసుకెళ్ళి, అనంతరం తుపాకీ తీసి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఇతరులు ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ఆ ఘటనపై అధికారులు పూర్తి వివరాలు తెలపలేదు.

దుండగుడు ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డాడన్న విషయంపై స్పష్టతరాలేదు. అమెరికా క్యాపిటల్‌ హిల్‌ అంటే ఆ దేశ ప్రభుత్వం, సుప్రీంకోర్టు, సెనెట్‌, ప్రతినిధుల సభకు నిలయం. ఆ భవనంపై ముందు గతంలోనూ పలుసార్లు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. చివరిసారిగా, ఏడాది క్రితం బారికేడ్లను ఢీ కొడుతూ ఓ వాహనం దూసుకు వెళ్ళింది. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.

గత ఏడాది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మద్దతుదారుల ముట్టడితోనూ క్యాపిటల్ హిల్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అంతటి భీకర దాడి చరిత్రలో ఎన్నడూ జరగలేదు. దీంతో అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ తాజాగా, ఓ వ్యక్తి కారుతో దూసుకు వెళ్ళడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

China-Taiwan conflict: తైవాన్‌కు మొన్న నాన్సీ ఫెలోసీ.. ఇప్పుడు అమెరికా కాంగ్రెస్ సభ్యుల బృందం