Rapists : అక్కడ రేప్ చేస్తే..పురుషత్వం (castrated) కట్

  • Published By: madhu ,Published On : September 19, 2020 / 06:54 AM IST
Rapists : అక్కడ రేప్ చేస్తే..పురుషత్వం (castrated) కట్

#WeAreTired : ఏ దేశంలో చూసినా అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. కఠినమైన చట్టాలు తెచ్చినా కామాంధులు మారడం లేదు. నైజీరియాలోని కుదుమా రాష్ట్రం ఓ కఠినమైన నిర్ణయం తీసుకుంది. 14 ఏళ్లలోపు పిల్లలపై అత్యాచారం చేసిన కేసుల్లో దోషిగా తేలితే..వారికి పురుషత్వం కోల్పోయేలా ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు.



ఈ శిక్షకు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫైలును గవర్నర్ నాసిర్ అహ్మద్ ఎల్ రుఫాయీకు పంపించారు. ఆయన సంతకం పెడితే..చట్టరూపంగా మారనుంది. నేరం చేయకుండా..వారికి క్యాస్ట్రేషన్ చేయాలనే దానికి రుఫాయీ గతంలో మద్దతు ఇవ్వడం వల్ల..సంతకం పెడుతారని అందరూ భావిస్తున్నారు.
https://10tv.in/covid-19-health-inspector-arrested-for-raping-44-year-old-kerala-nurse-in-home-quarantine/
2015 నైజీరియాలో అత్యాచారాలకు సంబంధించి కొత్త చట్టం ప్రవేశపెట్టిన తర్వాత..దోషులకు శిక్ష పడే అవకాశాలు పెరిగిపోయాయి. నైజీరియా జాతీయ చట్టాల ప్రకారం అత్యాచార దోషులకు అక్కడ 14 ఏళ్ల నుంచి జీవితకాల జైలు శిక్ష వరకు పడే అవకాశం ఉంటుంది. కుదుమా రాష్ట్రంలో అత్యాచార ఘటనలు ఎక్కవవుతున్నాయి.



అత్యాచార ఘటనలను రూపుమాపేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆందోళన చేపట్టారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి పెద్ద పెట్టున నిరసనలు తెలిపారు.. ఆన్‌లైన్ పిటిషన్లు దాఖలు చేశారు. #WeAreTired అనే హ్యాష్‌ట్యాగ్ అక్కడ ట్రెండయ్యింది.