‘రేర్ ఎర్త్’ ఖనిజాలపై నియంత్రణ కోసం చైనా కుతంత్రాలు.. డ్రాగన్ ముసాయిదా బిల్లు అందుకేనా?

‘రేర్ ఎర్త్’ ఖనిజాలపై నియంత్రణ కోసం చైనా కుతంత్రాలు.. డ్రాగన్ ముసాయిదా బిల్లు అందుకేనా?

China pushes for tighter control over critical minerals : డ్రాగన్ చైనా.. అరుదైన ఖనిజాల (రేర్ ఎర్త్)మూలకాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. నక్కజిత్తుల చైనా.. దీన్ని ఆసరగా తీసుకుని భౌగోళిక రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తోంది. 2018లో చైనా 1.2 లక్షల టన్నుల రేర్‌ ఎర్త్‌ మూలకాలను ఉత్పత్తి చేసింది. రేర్ ఎర్త్ అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో చైనా తర్వాతే ఆస్ట్రేలియా, అమెరికా ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి.

భారత్‌, చైనా సైన్యాల మధ్య ఘర్షణ జరిగిన ప్రదేశాలకు దగ్గర్లోనే రేర్‌ ఎర్త్‌ మూలకాలు ఉండొచ్చని వెల్లడైంది. ఇక్కడ లభ్యమయ్యే అనేక ఖనిజాలు ఇంధన, శాస్త్ర, సైనిక పరిజ్ఞానాలకు కీలకంగా మారనున్నాయి. ఎలక్ట్రిక్ కార్లు కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లు, డిజిటల్‌ కెమెరాలు, విద్యుత్‌ కార్లు, శాటిలైట్లు, యుద్ధవిమానాల ఇంజిన్లు వంటి హైటెక్ ఉత్పత్తుల తయారీకి కీలకమైన ఖనిజాలు ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది.

అందుకే ఈ అరుదైన ఖనిజాలపై నియంత్రణను బలోపేతం చేసేందుకు చైనా ప్రభుత్వం ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే దీనిపై పెద్దఎత్తునా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ కొత్త బిల్లుపై మద్దతు కోసం ప్రజాభిప్రాయాన్ని కోరుతోంది. ఈ ఏడాదిలో ముసాయిదా బిల్లు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు విండ్ టర్బైన్లలో మోటారులకు అవసరమైన శాశ్వత అయస్కాంతాలలో నియోడైమియం, ప్రెసోడైమియం (NdPr) వంటి భారీ అరుదైన ఖనిజ మూలకాలను ఉపయోగిస్తారు. ఈ బిల్లు ప్రకారం.. అరుదైన ఖనిజాల ఎగుమతి, దిగుమతి కోసం కంపెనీలు నియంత్రణ చట్టాల నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.

వీటిలో ఎక్కువ మొత్తం సైనిక వినియోగానికి మళ్లించే అవకాశం ఉంది. చట్టవిరుద్ధంగా దోపిడీ చేసి సేకరించిన అరుదైన ఖనిజ లవణాల ఉత్పత్తుల కొనుగోలు అమ్మకాన్ని ముసాయిదా నిబంధనలు నిషేధిస్తున్నాయని చైనా ప్రభుత్వ జిన్హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ప్రపంచ ఉత్పత్తిలో చైనా వాటా 60 శాతానికి పైగా ఉండగా.. 2010లో ప్రాదేశిక వివాదంపై జపాన్‌కు అరుదైన భూముల ఎగుమతులను పరిమితం చేసింది.

చైనా ఇప్పటికే భారీ అరుదైన ఖనిజ మూలకాల ధరలను పెంచేసింది. 2018లో ట్రంప్ పరిపాలనలో కూడా అరుదైన ఖనిజాల సరఫరా గొలుసు స్థితిస్థాపకతను పెంచాలని కోరింది. అయితే, ప్రస్తుత కొత్త అధ్యక్షుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కూడా పర్యావరణ విధానాన్ని కట్టుబడి దీన్ని కొనసాగించే అవకాశం ఉంది. 2025 నాటికి చైనా దిగుమతులపై ఆధారపడటాన్ని 58 శాతం నుంచి 50 శాతానికి తగ్గించాలని భావిస్తోంది.