Ray-ban Stories smart glasse : కళ్లజోడులోనే స్మార్ట్ ఫోన్..ధర ఎంతంటే..

కళ్లజోడులోనే స్మార్ట్ ఫోన్. దాని పేరు Rayban Stories. ఇప్పటికే పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ గ్లాసెస్ భారత్ లో కూడా అందుబాటులోకి రానుంది.

Ray-ban Stories smart glasse : కళ్లజోడులోనే స్మార్ట్ ఫోన్..ధర ఎంతంటే..

Ray Ban Stories

Ray-ban Stories smart glasses : టెక్నాలజీ పెరిగింది. ఒకప్పుడు రేడియో..టేప్ రికార్డ్ రెండూ కలిపి ఉన్నదాన్ని టూ ఇన్ వన్ అనేవారు. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే రేడియో..ఫోను, టీవీ ఒకటేమిటి అన్ని దాంట్లోనే. టెక్ డెవలప్ మెంట్లో భాగంగా కళ్లజోడులో స్మార్ట్ ఫోన్ కూడా వచ్చేసింది. ‘రేబాన్ కళ్లజోడు గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. Ray-ban అంటే లగ్జరీ బ్రాండ్. కూలింగ్ గ్లాసెస్ లో Ray-ban ఓ ఐకాన్. Ray అంటే కిరణం అంటే సూర్యకిరణాలను బ్యాన్ చేసేది అనిఅర్థం. అన్ని వయసుల వారికి ఓ ఠీవీని తెచ్చిపెట్టే అంతర్జాతీయ బ్రాండ్ Ray-ban.

Read more : Laughing Banned in NorthKorea :దటీజ్ కిమ్..ఉత్తరకొరియాలో ప్రజలు నవ్వొద్దు, తాగొద్దు,వేడుకలు చేసుకోవద్దు..

అటువంటి స్మార్టెస్ట్ రేబాన్ కళ్లజోడుకు స్మార్ట్ ఫోన్ తోడైతే..Rayban Stories అవుతుంది. అంటే..Rayban ఫేస్ బుక్ తో కలిసింది. . నెక్ట్స్ జనరేషన్ కళ్లజోడు అనే స్టైల్ లో స్మార్ట్ గా సరికొత్త స్మార్ట్ గ్లాసెస్ కు రూపకల్పన చేసింది. ఈ కళ్లజోడుకు ‘రేబాన్ స్టోరీస్’ అని పేరు పెట్టారు.ఈ రేబాన్ స్టోరీస్ కేవలం కళ్లజోడు మాత్రమే కాదు. ఇదొక స్మార్ట్ ఫోన్ కూడా. ఇందులో ఫోన్ కాల్స్ కోసం 3 మైక్రోఫోన్లు, రెండు వైపులా స్పీకర్లు, కుడివైపున టచ్ కంట్రోల్స్, ఫొటోలు తీసుకోవడానికి వీలుగా ఫ్రేమ్ కు రెండు వైపులా 5 ఎంపీ సామర్థ్యంతో కూడిన కెమెరాలు కూడా ఉన్నాయి.

Read more : Aadhar To New Borns : పుట్టిన వెంటనే శిశువులకు ఆధార్ కార్డు..ఆస్పత్రి నుంచే ఇంటికి కార్డ్

ఈ స్మార్ట్ గ్లాసెస్ కు సంబంధించిన మరో ఫీచర్ ను మార్క్ జుకర్ బర్గ్ పరిచయం చేశారు. ఈ స్మార్ట్ గ్లాసెస్ ద్వారా ఫేస్ బుక్ మెసెంజర్ ను కూడా ఉపయోగించవచ్చు. మెసెంజర్ లో మెసేజ్ లు పంపడం..తీసుకోవటం కూడా ఉంటుందని జుకర్ బర్గ్ వెల్లడించారు.

ఈ సరికొత్త రేబాన్ గ్లాసెస్ ను 6 వేరియంట్లలో తీసుకువస్తున్నారు. వీటిని గత సెప్టెంబరులో అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఇటలీ, ఐర్లాండ్, కెనడా దేశాల్లో తీసుకువచ్చారు. ఇవి త్వరలోనే భారత్ లో కూడా అందుబాటులోకి రానున్నాయి. మరి ఈ స్మార్టెస్ట్ గ్లాసెస్ ధర ఎంతుంటుందో అనే డౌట్ కూడా ఉంటుంది కదా.. భారత్ లో వీటి ధర రూ.22 వేల నుంచి రూ.28 వేల మధ్య ఉంటుందని తెలుస్తోంది.