Ray-Ban Leonardo : రేబాన్ సృష్టికర్త లియోనార్డో కన్నుమూత

రేబాన్ బ్రాండ్ సృష్టికర్త లియోనార్డో డెల్ వెచ్చియో క‌న్నుమూశారు. లియోనార్డో వ‌య‌సు 87 ఏళ్లు. ఐ గ్లాసెస్ మార్కెట్‌లో రేబాన్ గ్లాసెస్ కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది.

Ray-Ban Leonardo : రేబాన్ సృష్టికర్త లియోనార్డో కన్నుమూత

Ray Ban Leonardo

Ray-Ban Leonardo : రేబాన్ గ్లాసెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్ గా ఫేమస్ బ్రాండ్. రేబాన్ బ్రాండ్ సృష్టికర్త లియోనార్డో డెల్ వెచ్చియో క‌న్నుమూశారు. లియోనార్డో వ‌య‌సు 87 ఏళ్లు. ఐ గ్లాసెస్ మార్కెట్‌లో రేబాన్ గ్లాసెస్ కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఇటలీలో జన్మించిన లియోనార్డో ఎస్సిల్లార్ ల‌క్సోటికా పేరుతో 25 ఏళ్ల వ‌య‌సులో కంపెనీ ప్రారంభించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా వ్యాపారాన్ని పెంచుతూ మేటి బిజినెస్ మ్యాన్ గా మారారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

లియోనార్డో చిన్న‌పాటి కంటి అద్దాల షాపుతో ప్ర‌పంచ వ్యాప్తంగా మేటి బిజినెస్‌మాన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం ల‌క్సోటికా కంపెనీ చైర్మెన్‌గా ఉన్నారు. ఇట‌లీలో ఓ అనాథ‌గా ఉన్న బాలుడు.. ప్ర‌పంచ సంప‌న్నుడిగా ఎలా మారాడ‌న్న‌ డెల్ వెచ్చియో స్టోరీ అంద‌రికీ తెలిసిందే. 1961లో ల‌క్సోటికా కంపెనీని ఆయ‌న స్థాపించారు. ఆ త‌ర్వాత ఆ కంపెనీ నుంచి వ‌చ్చిన రేబాన్ బ్రాండ్ వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందింది.

Russia-Ukraine War : రష్యా సైనికులకు చుక్కలు చూపించిన ‘మేక’..! 40మందికి గాయాలు..!!

రేబాన్ బ్రాండ్ తో కళ్లజోడు వ్యాపారంలో తిరుగులేని బిజినెస్ మ్యాన్ గా లియోనార్డో గుర్తింపు పొందారు. ఆయన మరణాన్ని ఇటాలియన్ దినపత్రిక కొరియర్ డెల్లా సెరా సోమవారం నిర్ధారించింది. లియోనార్డో మిలాన్ లోని ఓ అనాథాశ్రమంలో పెరిగారు. వెనిస్‌కు ఉత్తరాన ఉన్న ఆల్ప్స్‌లోని అగోర్డో పట్టణంలో దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక కళ్లద్దాల తయారీదారులకు ఫ్రేమ్ భాగాల సరఫరా చేసేవారు.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం జూన్ 1 నాటికి డెల్ వెచ్చియో ఆస్తుల నికర విలువ $25.7 బిలియన్లు. “నేను చేసే ప్రతి పనిలో అత్యుత్తమంగా ఉండటానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాను” అని లియోనార్డో చెప్పేవారు. మే 22, 1935న జన్మించిన డెల్ వెచ్చియో మిలన్‌లో అనాథగా పెరిగారు. ఏడేళ్ల వయసులో డెల్ వెచ్చియోను అతడి తల్లి అనాథాశ్రమానికి పంపింది. 14 సంవత్సరాల వయస్సులో మిలన్‌లోని ఒక టూల్ డై తయారీ వద్ద అప్రెంటిస్‌గా పనిచేయడం ప్రారంభించాడు డెల్ వెచ్చియో.

డెల్ వెచియో 1960లలో అగోర్డోకు వెళ్లారు. కళ్లద్దాల ఫ్రేమ్‌లను తయారు చేసే చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. 1961లో 14 మంది కార్మికులతో కలిసి లక్సోటికాను స్థాపించారు. 1960ల చివరలో సొంత డిజైన్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. 1980లలో డెల్ వెచ్చియో అమెరికాలో కంపెనీలను కొనుగోలు చేయడం ప్రారంభించారు. 1999లో $640 మిలియన్లకు రే-బాన్‌ను కొనుగోలు చేశారు.

తన కెరీర్ ప్రారంభంలో డెల్ వచ్చియో తన పిల్లలకు తక్కువ సమయాన్ని కేటాయిస్తూ పనికి ఎక్కువ సమయం కేటాయించారు. “ఫ్యాక్టరీ నా నిజమైన కుటుంబంగా మారింది,” అని ఆయన చెప్పేవారు.