భారత్‌పై నేపాల్ వ్యతిరేకత వెనుకుంది చైనానే

  • Published By: Subhan ,Published On : May 21, 2020 / 02:27 PM IST
భారత్‌పై నేపాల్ వ్యతిరేకత వెనుకుంది చైనానే

ఇప్పటిదాకా భారత్‌తో బోర్డర్ దగ్గర పాకిస్తాన్ మాత్రమే పంచాయితీకి దిగేది..కానీ ఇప్పుడు నేపాల్ కూడా సై అంటోంది..ఓ వైపు చైనా వరసగా ఘర్షణకు దిగడం మరోవైపు నేపాల్ పదే పదే భారత్‌ని చికాకు పెట్టడం అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈ రెండు దేశాలు కలిసే భారత్‌ని టార్గెట్ చేయడం  వెనుకున్న కుట్రేంటి..? 

భారత్‌పై కడుపుమంటతో చైనా కాలు దువ్వుతుందనుకోవచ్చు.. కానీ మన పొరుగుదేశం నేపాల్ కూడా మన భూభాగంపైనే ఝలక్ ఇచ్చే కామెంట్లు చేస్తోంది. మానస సరోవర్ యాత్రకి దారి మా భూభాగంలోంచి కుదరదంటూ ప్రకటనలు గుప్పిస్తోంది. ఇదంతా చూస్తే నేపాల్ ఓవరాక్షన్ వెనుక చైనా ఉందనేది స్పష్టంగా కన్పిస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కొంతకాలంగా ప్లాన్ ప్రకారం వ్యవహారాన్ని నడిపిస్తుందంటున్నారు.

ఏప్రిల్ చివరివారంలో లద్దాక్ తూర్పు ప్రాంతంలో..మే 5న పాంగాంగ్ సరస్సు దగ్గర.. గత వారం లద్దాక్ ఏరియాలో తూర్పు వైపుగా రెండు దేశాల సైనికుల మధ్య భారీ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మే 5 రాత్రి పాంగాంగ్ సరస్సు వద్ద మే 6 తర్వాత సిక్కింలోని నాకులా పాస్ దగ్గర చైనా సైనికులు మన సైన్యంపైకి దూసుకువచ్చారు. ఇలా ముప్పేట అతిక్రమణలకు కారణమేంటి. దాని వెనుక చైనా ప్లానేంటనేది అర్ధం చేసుకోవాలంటే ముందుగా చైనాతో మన సరిహద్దు ప్రాంతాల ప్రాముఖ్యత తెలుసుకోవాలి..

లద్దాక్ ఏరియాలోనే భారత్‌కి రెండు ప్రధాన ఎయిర్‌ ఫోర్స్ స్థావరాలున్నాయి. వాటిలో లేహ్ సెక్టార్‌ ఒకటి.. లేహ్ నుంచే వాస్తవాధీన రేఖ వెంట ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గస్తీ నిర్వహిస్తుంటుంది.. ఈ నాకులా పాస్ సెక్టార్ సిక్కిం దగ్గర ఉంది. చైనాకి సిక్కిం బోర్డర్ ప్రారంభమయ్యే చోటు ముగుతాంగ్ అనే ప్రదేశానికి దగ్గరగా నాకులా సెక్టార్ ఉంది. ముగుతాంగ్ వద్దనే టిబెట్ శరణార్ధులు తలదాచుకుంటుంటారు. ఇక్కడ కనుక తన ఆధిపత్యం చెలాయిస్తే.. టిబెట్ పై కూడా డామినేషన్ చేయవచ్చనేది చైనా ప్లాన్..

చైనా తాజాగా తన డామినేషన్ చూపించాలని తపన పడుతున్న పాంగాంగ్ సరస్సు విషయం చూస్తే.. ఇది కూడా లద్దాక్ లోనిదే. ఇక్కడి తూర్పు ప్రాంతంలో ఉన్న పాంగాంగ్ పేరుకే సరస్సు కానీ, 134 కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉంది.. సముద్రమట్టానికి 14వేల 270 అడుగుల ఎత్తున ఉన్న ఈ సరస్సు పరిధి లద్దాక్ నుంచి టిబెట్ వరకూ వ్యాపించి ఉండగా.. 5 కిలోమీటర్లు వెడల్పులో ప్రవహిస్తుంది..సరస్సు తీరం వెంబడి భారత్, చైనా రెండు దేశాలూ పడవలతో గస్తీ నిర్వహిస్తుంటాయి. 

రెండు దేశాల మధ్య ఉన్న నియంత్రణ సరిహద్దు రేఖ సరస్సు మధ్యనుంచే వెళ్తుంది..పాంగాంగ్ సరస్సులో మూడింట రెండువంతులు చైనానే నియంత్రిస్తుంది. అందుకే తరచూ ఇక్కడ చైనా తన ఆధిపత్యం నిరూపించుకునేందుకు దూకుడు చూపిస్తుంటుంది. 

పాంగాంగ్ లేక్ మధ్య వెయ్యి కిలోమీటర్ల దూరం ఉండగా…ఈ రెండూ వాస్తవాధీన రేఖ పరిధిలోకే వస్తాయి. అలా చైనా వ్యూహాత్మకంగా పాంగాంగ్, లద్దాక్ ఏరియాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. పైకి ఆ దేశ అధికారులు చెప్తున్నట్లుగా సాధారణంగా జరిగే గొడవలు ఇవి కావని అంతర్జాతీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. 

దీనికి తోడు నేపాల్‌ని కూడా వెనకనుంచి రెచ్చగొడుతోంది.. భారత్‌పైకి ఉసిగొలుపుతోంది చైనా. దానికి మానససరోవర యాత్రని అడ్డుగా చూపిస్తోంది.. లిపూలేఖ్- ధారచులా మీదుగా యాత్రకి వెళ్లేందుకు ఓ రోడ్డు నిర్మిస్తే..అది తమ భూభాగం నుంచి వెళ్తుందని..నేపాల్ అభ్యంతరపెట్టింది. .హిమాలయాలకు చేరడానికి ఇది మనకి కనీసం వెయ్యి కిలోమీటర్ల మేర దూరం తగ్గిస్తుంది. ఉత్తరాఖండ్‌లోని ఈ మార్గం సముద్రమట్టానికి 17వేల అడుగుల ఎత్తున ఉంటుంది. 

ఇది మన భూభాగం ఇష్టం. ఈ దారిలో కైలాసయాత్ర జరపడంపై సడన్‌గా పొరుగుదేశం నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది..మన రాయబారి వినయ్‌ మోహన్‌ క్వట్రాకు  నోటీసులు జారీ చేసింది. లిపూలేఖ్‌ తమ ఆధీనంలోని ప్రాంతమంటూ చెప్పుకొచ్చింది. లిపూలేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలను తన దేశంలోని భాగాలని వాదించడం ప్రారంభించింది..ఏకంగా ఓ మ్యాప్‌నే తయారు చేసింది నేపాల్..ఇంతగా నేపాల్ ఓవరాక్షన్ చేస్తుందంటే దాని వెనుక డ్రాగన్ కంట్రీ ఉందనే అంటున్నారు..లేకపోతే ఉత్తరఖండ్‌లోని ధారచులా ప్రాంతాన్ని తమ భూభాగంగా చెప్పడమే ఆ దేశపు అతికి నిదర్శనం.. 

ఈ  రోడ్డు నిర్మిస్తే..అటు చైనా,, ఇటు నేపాల్ రెండు దేశాలపై భారత్ మానససరోవర యాత్ర కోసం ఆధారపడటం తగ్గిపోతుంది.. చైనా, నేపాల్ బోర్డర్ల దగ్గరకు భారత సైన్యం సులభంగా చేరుకుంటుంది..ఇది కూడా చైనా, నేపాల్ అభ్యంతరాలకు కారణంగా కొంతమంది చెప్తున్నారు.. అందుకే కావాలనే సరిహద్దుల్లో సెగ పుట్టిస్తోందన్న వాదన వినిపిస్తోంది.