కరోనా భయంతో తెగ తాగేస్తున్నారు..సర్వేలో తేలిన నిజం

  • Published By: nagamani ,Published On : November 9, 2020 / 04:16 PM IST
కరోనా భయంతో తెగ తాగేస్తున్నారు..సర్వేలో తేలిన నిజం

covid stress people alcohol : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఏడాది కావస్తున్నా దాని ఉదృతి ఏమాత్రం తగ్గట్లేదు. ఇంటినుంచి కాలు కదపాలంటే చాలు మాస్క్..శానిటైజర్ తప్పనిసరిగా మారిపోయింది. దీంతో కరోనా అంటే ప్రజల్లో భయం పెరుగుతోంది.



ప్రాణాలు తీసేస్తుందనే భయం, బంధువులను..స్నేహితులను కలవాలంటే భయం, ఎక్కడికన్నా ఫ్రీగా వెళ్లాలంటే భయం, ఏది తిందామన్నా భయం, ఏది ముట్టుకుందామన్నా భయం ఇలా సమాజానికి దూరం అయిపోతున్నామనే భయం, చాలా వరకూ ఇళ్లకే పరిమితం అకావటంతో ఒంటరితనం, ఎక్కడ కరోనా సోకి వివక్షకు గురవుతున్నామని భయంతో ప్రజలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు మత్తుకు బానిసలవుతున్నారట.




https://10tv.in/man-died-drinking-raw-alcohol-in-banswada/
మానసికంగా ఒత్తిడికి గురవుతూ కృంగిపోతున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకునేందుకు వాడుతున్న మందు ఏంటో తెలుసా..? మద్యం. అవును.. కరోనా భయం నుంచి బయటపడేందుకు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది మత్తులో తూగుతున్నారట. కరోనా భయం పోగొట్టుకోవడానికి ప్రజలు ఏం చేస్తున్నారు? ఎటువంటి దారులు ఎంచుకుంటున్నారనే అంశంపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలే ఈ విషయాన్ని నిర్ధారించారు. అమెరికాలోని మసాచూసెట్స్‌లో ఉన్న మెక్‌లీన్ ఆసుపత్రిలోని వైద్య నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మద్యం వినియోగంపై ప్రత్యేక అధ్యయనం చేయగా ఈ విషయాల్లో వెల్లడయ్యాయి.


కోవిడ్ మహమ్మారి వేవ్స్ నేపథ్యంలో ప్రజలు సమాజానికి దూరంగా, ఒంటరిగా జీవిస్తుండడం వారిలో ఒత్తిడిని తీవ్రం చేస్తోందని, ఆ ఒత్తిడిని పోగొట్టుకునేందుకు విపరీతంగా మద్యానికి అలవాటు పడతున్నాడరనీ తెలిపారు అధ్యయనకారులు.ఇది ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందనీ..ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని లేదంటే సమాజం మానసిక దర్భలత్వానికి దారి తీస్తుందన్నారు. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావటానికి అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నామని నిపుణులు తెలిపారు.


ఇప్పటి వరకూ వచ్చిన అన్ని మహమ్మారు (వైరస్ )లకంటే కరోనా మహమ్మారి ప్రమాదకరమైందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయాన్ని సాక్షాత్తు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నే చెప్పింది. అంతేకాదు కరోనా దీర్ఘకాలం కొనసాగుతుండడం వల్ల ప్రజల్లో అనేక రకాల మానసిక రుగ్మతలకు దారితీస్తోంది.


కుటుంబ, ఆర్థిక, సామాజిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ప్రలు మానసిక ఒత్తిడికి లోనై మద్యానికి అలవాటు పడిపోతున్నారనీ మెక్‌లీన్ ఆసుపత్రిలోని ఓ అధ్యయనకారుడు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ బులెటిన్‌ల ద్వారా ఈ సమస్యపై అవగాహన పెంచాలని, కరోనా ఎదుర్కోవడంతో పాటు మద్యం తాగడం వల్ల కలిగే నష్టాలు కూడా ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు.