REEP Technologies ‘Deprinter’: కాగితాలపై ప్రింట్ ను తుడిచేసే ‘డీప్రింటర్‌’..ఒక్కో పేపర్‌ను 10 సార్లు వాడుకునే టెక్నాలజీ..

తెల్ల కాగితాన్ని ప్రింటర్ లో పెట్టి ఒక్కసారి ప్రింట్ చేశామంటే అది ఇక ఎప్పటికీ తెల్లకాగితంగా మారదు. కానీ ఇప్పుడలా కాదు. తెల్లకాగితంపై ప్రింట్ ఇచ్చాక దాన్ని తిరిగి తెల్లకాగితంలా మార్చేయొచ్చు. అలా ఒకసారి కాదు 10సార్లు చేయవచ్చు.

REEP Technologies ‘Deprinter’: కాగితాలపై ప్రింట్ ను తుడిచేసే ‘డీప్రింటర్‌’..ఒక్కో పేపర్‌ను 10 సార్లు వాడుకునే టెక్నాలజీ..

Reap Company Created Deprinter That Removes Ink From Paper (1)

REEP Technologies Deprinter : తెల్ల కాగితాన్ని ప్రింటర్ లో పెట్టి ఒక్కసారి ప్రింట్ చేశామంటే అది ఇక ఎప్పటికీ తెల్లకాగితంగా మారదు. కానీ ఇప్పుడలా కాదు. టెక్నాలజీ మారింది. తెల్లకాగితంపై ప్రింట్ ఇచ్చాక దాన్ని తిరిగి తెల్లకాగితంలా మార్చేయొచ్చు. అలా ఒకసారి కాదు 10సార్లు చేయవచ్చు. అంటే ప్రింట్ ఇచ్చి చెరిపేసి..మళ్లీ మళ్లీ తెల్లకాగితంలా మార్చి వాడుకోవచ్చు.అలా 10సార్లు వాడుకునే టెక్నాలజీని రూపొందించింది ‘రీప్ సంస్థ’. ఇదేదో భలే ఉందే..పదే పదే తెల్లకాగితాలు కొనుక్కోనవసరం లేదు..పైగా పేపర్లు వేస్ట్ కాకపోవటం వల్ల పర్యావరణానికి మేలు కూడా జరిగినట్లు అవుతుంది. కాగితం తయారీకి అవసరమైన చెట్లను పరిరక్షించవచ్చు. తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. అటవీ సంపదను పెంచవచ్చు. ఇంత మేలు జరిగేలా ఒక్క పేపర్ ను 10సార్లు వాడుకునే టెక్నాలజీని రూపొందించింది ఇజ్రాయెల్ కు చెందిన ‘రీప్ సంస్థ’..

సాధారణంగా ప్రింటర్‌లో ఏమైనా ప్రింట్‌ చేశామంటే.. ఆ కాగితాలను అవసరం ఉన్నంతసే పు ఉంచేయడం.. ఆ తర్వాత పడేయడమే.. కానీ కా గితాలపై ఇంకును తుడిచేస్తూ.. మళ్లీ మళ్లీ వాడుకోగలిగితే! భలే ఉంది కదూ ఈ ఐడియా..వాట్ యాన్ ఐడియా సర్ జీ అన్నట్లుగా ఉంది కదూ..దానికి రూపకల్పన చేసింది ‘రీప్‌ సంస్థ’.. కాగితాలపై ఇంకును తుడిచేసే ‘డీప్రింటర్‌’ను రూపొందించింది. అంటే ప్రింటర్‌ ఇంకును ముద్రిస్తే.. ఈ ‘డీ ప్రింటర్‌’ ఆ ఇంకును తుడిచేసి మళ్లీ తెల్ల కాగితాలుగా మార్చి ఇచ్చేస్తుంది. ఈ టెక్నాలజీకి ‘రీప్‌ సర్క్యులర్‌ ప్రింట్‌ (ఆర్‌సీపీ)’ అని పేరు పెట్టారు.

ప్రత్యేకమైన పేపర్‌.. లేజర్‌ క్లీనర్‌తో..
డీప్రింటింగ్‌ టెక్నాలజీని వినియోగించాలంటే.. అందుకోసం కాస్త మార్పులు చేసిన ప్రత్యేకమైన పేపర్‌ను వినియోగించాల్సి ఉంటుందని రీప్ సంస్థ తెలిపింది. ఈ పేపర్‌ను ప్రింటర్‌లో వినియోగించినప్పుడు ఇంకు పూర్తిగా లోపలివరకు ఇంకిపోకుండా.. పైపొరల్లోనే ముద్రితం అవుతుంది. తర్వాత ఈ పేపర్లను ‘డీ ప్రింటర్‌’లో పెట్టినప్పుడు.. దానిలోని ప్రత్యేకమైన లేజర్‌ ఇంకును ఆవిరి చేసేస్తుంది. దీనితో తెల్ల కాగితం బయటికి వస్తుంది. ఈ సాంకేతికతతో ఒక్కో పేపర్‌ను 10 సార్లు వాడుకోవచ్చట. అంటే కాగితం తయారీ కోసం చెట్లను నరకడం 90% తగ్గిపోతుందని కంపెనీ చెబుతోంది.