శవాల దిబ్బ : పెరులో 227 మంది చిన్నారుల అస్థిపంజరాలు!

అదో శవాల దిబ్బ. ఎన్నో యేళ్ల క్రితం చిన్నారులు ప్రాణ త్యాగం చేసిన చారిత్రక స్థలం. పురావస్తు శాఖ అధికారుల తవ్వకాల్లో బయటపడ్డ నిజం. 227 మంది చిన్నారుల అస్థిపంజరాలు తవ్వకాల్లో వెలికితీశారు.

  • Published By: sreehari ,Published On : August 28, 2019 / 09:26 AM IST
శవాల దిబ్బ : పెరులో 227 మంది చిన్నారుల అస్థిపంజరాలు!

అదో శవాల దిబ్బ. ఎన్నో యేళ్ల క్రితం చిన్నారులు ప్రాణ త్యాగం చేసిన చారిత్రక స్థలం. పురావస్తు శాఖ అధికారుల తవ్వకాల్లో బయటపడ్డ నిజం. 227 మంది చిన్నారుల అస్థిపంజరాలు తవ్వకాల్లో వెలికితీశారు.

అదో శవాల దిబ్బ. ఎన్నో యేళ్ల క్రితం చిన్నారులు ప్రాణ త్యాగం చేసిన చారిత్రక స్థలం. పురావస్తు శాఖ అధికారుల తవ్వకాల్లో బయటపడ్డ నిజం. 227 మంది చిన్నారుల అస్థిపంజరాలు తవ్వకాల్లో వెలికితీశారు. దక్షిణ అమెరికాలోని కొలంబియన్ చిము సంస్కృతిని ప్రతిబింబించేలా భారీ అవేశేషాలు బయటపడ్డాయి. వందలాది మంది చిన్నారులు తమకు తాము ప్రాణత్యాగం చేసుకున్న చారిత్రక స్థలంగా పేరుగాంచింది. 2018 ఏడాది నుంచి పురావాస్తు శాఖ తవ్వే కొద్ది వందలకొద్ది అస్థిపంజరాలు వెలికి వస్తున్నాయి. హుయాన్‌చాకో బీచ్ సమీపంలో ఉన్న పర్యాటక నగరమైన ఉత్తర రాజధాని లిమాలో ఈ అవశేషాలు ఉన్నాయి. 

చిన్నారులు తమ ప్రాణాలను త్యాగం చేసిన అతిపెద్ద ప్రదేశమని చీఫ్ పురావస్తు అధికారి ఫెరెన్ క్యాస్టిల్లో తెలిపారు. ప్రాణ త్యాగం చేసిన చిన్నారులంతా 4 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయస్సు వారేనని గుర్తించారు. చిము సంస్కృతిలో దైవాలుగా గౌరవిస్తూ ఇలా ప్రాణత్యాగం చేసి ఉంటారని క్యాస్టిల్లో చెబుతున్నారు. వాతావరణం బాగా తేమగా ఉన్న సమయంలో చిన్నారులను బలి ఇచ్చి ఉండొచ్చునని ఆయన తెలిపారు. చిన్నారుల శరీర అవశేషాలు ఇంకా ఉండే అవకాశం ఉందని అన్నారు. ఒక చోట తవ్వితే మరో చోట అస్థిపంజరాలు బయటపడుతున్నాయని క్యాస్టిల్లో చెప్పారు. పిల్లల శరీర అవశేషాలు సముద్రానికి ముఖంగా ఉన్నాయని, వాటిలో చర్మం, వెంట్రుకలు అలానే ఉన్నాయని తెలిపారు. 

1200 నుంచి 1400 ఏళ్ల నాటి చిము సంస్కృతి నాటి కాలంలో ఎక్కువ సంఖ్యలో చిన్నారులు ఇక్కడే ప్రాణ త్యాగం చేసి ఉంటారని పురావస్తు శాఖ అంచనా వేస్తోంది. జూన్ 2018లో పొరుగుప్రాంతమైన పంపా ల క్రజ్ నగరంలో చిన్నారుల అస్థిపంజరాలను తొలుత పురవాస్తు శాఖ గుర్తించింది. అందులో 56వరకు పుర్రెలు బయటపడ్డాయి. హుయాన్‌చాకో నుంచి పంపా ల క్రూజ్ కు అతి సమీపంలో ఉంది. ప్రాణత్యాగం చేసిన 140మంది చిన్నారుల అస్థిపంజరాలతో పాటు 2వందల ఒంటెల అస్థిపంజరాలు కూడా ఏప్రిల్ 2018లో ఇదే ప్రదేశంలో బయటపడ్డాయి. పెరువియన్ నుంచి ఈక్వెడర్ వరకు చిము నాగరికత విస్తరించింది. ఐంకా సామ్రాజ్యం స్వాధీనం చేసుకున్నాక 1475లో ఇది కనుమరుగైపోయింది.