Australian Currency Elizabeth : ఆస్ట్రేలియా కరెన్సీపై క్వీన్ ఎలిజబెత్-2 ఫొటో తొలగింపు

ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. కరెన్సీ నోట్ పై దివంగత క్వీన్ ఎలిజబెత్-2 ఫొటోను తొలగించి కొత్త నోట్లను ముద్రించాలని నిర్ణయం తీసుకుంది.

Australian Currency Elizabeth : ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. కరెన్సీ నోట్ పై దివంగత క్వీన్ ఎలిజబెత్-2 ఫొటోను తొలగించి కొత్త నోట్లను ముద్రించాలని నిర్ణయించింది. మొదటగా 5 డాటర్ల నోట్ పై ఆమె ఫొటోను తొలగించి, ఆ స్థానంలో స్వదేశీ సంస్కృతి, చరిత్ర ప్రతిబింబించేలా.. గౌరవించేలా కొత్త డిజైన్ ను రూపొందించనుంది. ఈ మేరకు ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.

ప్రస్తుతం 5 డాలర్ల నోట్ పై ఒక వైపు క్వీన్ ఎలిజబెత్-2 ఫొటో, మరోవైపు ఆస్ట్రేలియా పార్లమెంట్ భవనం ఫొటో ఉంటుంది. కాగా, క్వీన్ ఎలిజబెత్-2 ఫొటోను మాత్రమే తొలగిస్తామని ఆస్ట్రేలియా వెల్లడించింది. కొత్త నోట్ రూపకల్పనలో స్వదేశీ సమూహాలను సంప్రదిస్తామని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది.

Queen Elizabeth II: 15 రాజ్యాలకు రాణి.. 23226 రోజుల పాలన.. ఇదీ క్వీన్ ఎలిజబెత్ ప్రస్థానం

అయితే, కొత్త నోట్ వచ్చే వరకు ప్రస్తుత నోట్ చెలామణిలో ఉంటుందని తెలిపింది. క్వీన్ ఎలిజబెత్-2 మరణం తర్వాత ఆమె కుమారుడు చార్లెస్ కింగ్ చార్లెస్-3 బ్రిటన్ బయట ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా 12 కామన్ వెల్త్ దేశాలకు అధిపతిగా ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు