Blood Test Detect Alzheimer’s : అల్జీమర్స్ ను ముందే గుర్తించొచ్చు.. ఎలాగో తెలుసా?

అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు అల్జీమర్స్ ను ముందే గుర్తించే రక్త పరీక్షను కనుగొన్నారు. మెదడులో అమిలాయిడ్ బీటా అనే ప్రొటీన్లు అస్తవ్యవస్థంగా ఒకదానిపై మరొకటి ముడుచుకుపోయి ఒలిగోమర్స్ ను ఏర్పరుస్తామని తెలిపారు.

Blood Test Detect Alzheimer’s : అల్జీమర్స్ ను ఇప్పుడు ముందుగానే గుర్తించవచ్చు. అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు అల్జీమర్స్ ను ముందే గుర్తించే రక్త పరీక్షను కనుగొన్నారు. మెదడులో అమిలాయిడ్ బీటా అనే ప్రొటీన్లు అస్తవ్యవస్థంగా ఒకదానిపై మరొకటి ముడుచుకుపోయి ఒలిగోమర్స్ ను ఏర్పరుస్తామని తెలిపారు. ఈ ఒలిగోమర్స్ అల్జీమర్స్ కు కారణమవుతున్నట్లు గుర్తించారు.

Alzheimer’s Disease : అల్జీమర్స్ సమస్యకు చెక్

రక్తనమూనాల్లో ఈ ఒలిగోమర్స్ సంఖ్యను బట్టి అల్జీమర్స్ లక్షణాలను అంచనా వేశారు. మొత్తం 11 మంది రక్తనమూనాలను సేకరించగా ఇందులో 10 మందిలో ఒలిగోమర్స్ సంఖ్య అధికంగా ఉందన్నారు. కాలక్రమంలో వారందరూ అల్జీమర్స్ బారిన పడినట్లు పరిశోధకులు గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు