Zombie Virus : మరో ప్రాణాంతక వైరస్‌.. 50 వేల ఏళ్లుగా మంచు కిందే..

ఇప్పటికే కరోనా, మంకీపాక్స్ వంటి పలు రకాల ప్రాణాంతకమైన వైరస్ ప్రాణాలను హరిస్తుంటే తాజాగా మరో ప్రమాదకరమైన వైరస్ వెలుగులోకి వచ్చింది. 50 వేల ఏళ్ల నాటి జాంబీ వైరస్‌లను మంచు కింద గుర్తించారు.

Zombie Virus : మరో ప్రాణాంతక వైరస్‌.. 50 వేల ఏళ్లుగా మంచు కిందే..

zombie virus : రోజుకో కొత్త వైరస్ ప్రపంచాన్ని వణికిస్తూనేవుంది. రోజు రోజుకు ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వైరస్ లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే కరోనా, మంకీపాక్స్ వంటి పలు రకాల ప్రాణాంతకమైన వైరస్ ప్రాణాలను హరిస్తుంటే తాజాగా మరో ప్రమాదకరమైన వైరస్ వెలుగులోకి వచ్చింది. 50 వేల సంవత్సరాల నాటి జాంబీ వైరస్‌లను మంచు కింద గుర్తించారు.

వాతావరణ మార్పుల కారణంగా మంచు కరిగి, దాని కింద వేల సంవత్సరాలుగా అచేతన స్థితిలో ఉన్న వైరస్‌లు చేతన స్థితికి వస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. తాజాగా 48500 ఏళ్ల కిందటి జాంబీ వైరస్‌లను రష్యా, జర్మనీ, ఫ్రాన్స్‌ పరిశోధకులు గుర్తించారు. రష్యాలోని సైబీరియాలో వేల సంవత్సరాలుగా మంచు కింద ఉన్న 24 వైరస్‌లను గుర్తించారు. వీటిలో సరస్సు అడుగు భాగాన గడ్డ కట్టి ఉన్న వైరస్‌ కూడా ఉండటం గమనార్హం.

Marburg virus: మరో ప్రాణాంతక వైరస్.. ఒకరి నుంచి నలుగురికి వ్యాప్తి

ఈ వైరస్‌లలో 13 కొత్త జాతులను గుర్తించామని చెప్పారు. వాటికి జాంబీ వైరస్‌ అని పేరు పెట్టామని వెల్లడించారు. లక్షల ఏళ్లుగా మంచు కింద బందీగా ఉన్న ఇలాంటి ప్రాణాంతక వైరస్‌లు అనేకం ఉన్నాయని తెలిపారు. మంచు కరగడంతో అవి వాతావరణంలో కలిసిపోయి మానవులపై దాడి చేసి, పెను ముప్పు సృష్టిస్తాయని ఆందోళన చెందుతున్నారు.