Planet : భూమి లాగే జలాన్ని కలిగి ఉన్న మరో గ్రహం.. సౌర వ్యవస్థ ఆవల

ఆ గ్రహంపై నీటి ఆవరి ఉనికిని గుర్తించారు. డబ్ల్యూఎస్ఏపీ-18బీ గ్రహాన్ని పరిశోధకులు 2009లో గుర్తించారు.

Planet : భూమి లాగే జలాన్ని కలిగి ఉన్న మరో గ్రహం.. సౌర వ్యవస్థ ఆవల

planet

Water On Planet : అంతరిక్షంలో భూమి లాగే జలాన్ని కలిగి ఉన్న గ్రహాల కోసం అన్వేషిస్తున్న పరిశోధకుల ప్రయత్నాలు ఫలించాయి. తాజాగా మన సౌర వ్యవస్థ ఆవల ఉన్న ఓ గ్రహంపై నీటి ఆనవాళ్లను గుర్తించారు. డబ్ల్యూఎస్ఏపీ-18బీ అనే గ్రహానికి సంబంధించి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పంపించిన చిత్రాలను విశ్లేషించారు.

ఆ గ్రహంపై నీటి ఆవరి ఉనికిని గుర్తించారు. డబ్ల్యూఎస్ఏపీ-18బీ గ్రహాన్ని పరిశోధకులు 2009లో గుర్తించారు. ఇది భూమి నుంచి దాదాపు 400 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది గురు గ్రహం కన్నా 10 రెట్లు బరువుగా ఉంంది.

Comet Closest Earth : ఆకాశంలో అద్భుత దృశ్యం.. 50 వేల ఏళ్ల తర్వాత భూమికి దగ్గరగా వచ్చిన ఆకుపచ్చ తోకచుక్క

తన నక్షత్రం చుట్టూ కేవలం 23 గంటల్లోనే చుట్టి రావడం ఈ గ్రహం ప్రత్యేకతగా చెప్పవచ్చు. అనగా మన భూమితో పోల్చినప్పుడు ఈ గ్రహంపై 23 గంటల్లోనే ఒక ఏడాది పూర్తి అవుతుంది.