బట్టతల మాయం చేయడానికి అద్భుతమైన టెక్నిక్ కనిపెట్టిన రీసెర్చర్స్

బట్టతల మాయం చేయడానికి అద్భుతమైన టెక్నిక్ కనిపెట్టిన రీసెర్చర్స్

Baldness: ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది తమ మెడికల్ కండిషన్ మెరుగుపరచుకోవడానికి కష్టపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా మగవాళ్లు మహమ్మారి జబ్బులు అయిన క్యాన్సర్, కొవిడ్-19, కొన్ని ప్రత్యేకమైన డ్రగ్ థెరఫీ తీసుకునేవాళ్లంతా.. బట్టతల సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇవే కాక చాలామందిలో ప్రత్యేక కారణాలతోనూ బట్టదల వస్తుంది. అసాధారణ లక్షణాలతో కనిపిస్తూ.. 35ఏళ్లకే బట్టతల వచ్చేసిందని అమెరికన్ హెయిర్ లాస్ అసోసియేషన్ చెప్తుంది. 50ఏళ్ల వచ్చేసరికి 85శాతం మంది మగాళ్ల జుట్లు పలచబడిపోతుందట.

బట్టతల అనేది ఏ ఒక్కరి ఆరోగ్యంపైనా ఎఫెక్ట్ చూపించదు. కానీ, అది ఎమోషనల్ గా ప్రభావం చూపిస్తుంది. బట్టతల కోసం చాలా థెరఫీలు అందుబాటులో ఉన్నాయి. జుట్టు ఊడిపోకుండా కాపాడగలరు. కానీ, మళ్లీ వెంట్రుకలు పెరగడం కష్టం. అయినా జపాన్ లోని ఓ టీం స్టెమ్ సెల్స్ తో జుట్టును రీ గ్రోత్ చేయొచ్చనే సొల్యూషన్ ను కనిపెట్టాయి.

స్టెమ్ సెల్స్ వాడి కుదుళ్ల నుంచి వెంట్రుకలు మొలిపించొచ్చు. అలా జుట్టు అనేది మళ్లీ వస్తుంది. జుట్టు ఊడిపోవడం అనేది సాధారణమైన విషయం. కానీ, ఊడిపోయిన ప్రతి వెంట్రుక అదే స్థానంలో కొత్తవి రావడం కష్టం. బయో సిస్టమ్స్ డైనమిక్స్ రీసెర్చ్ సైంటిస్టులు నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ లో మమ్మల్స్ (పాలతో పెరిగే జీవులు)పై జరిపిన ప్రయోగం గురించి వివరించారు.

మన కల్చర్ వ్యవస్థలో జుట్టును తిరిగి మొలిపించడం.. స్టెమ్ సెల్స్ సహాయంతో ఇది చేయడం చాలా హెల్ప్ అవుతుంది. భవిష్యత్ లో ఇది ఎక్కువ మంది వాడేస్తారనుకుంటున్నా అని తకాశీ సూజీ అనే రచయిత చెప్తున్నారు. బట్టతల రాకముందు సంప్రదించినా వచ్చే అవకాశాల్ని తగ్గించి రాకుండా చేస్తామని హామీ ఇస్తున్నారు.