Rishi sunak: లండన్‌లో హిందూ సంప్రదాయ పద్దతుల్లో గోపూజ చేసిన రిషి సునక్ దంపతులు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో

లండన్‌లో బోరిస్ జాన్సన్ తరువాత ప్రధాని పదవి రేసులో నిలిచిన భారతీయ సంతతి వ్యక్తి రుషి సునక్ ఇటీవల లండన్ లో గోపూజ చేశారు. ఆయన సతీమణి అక్షతా మూర్తితో కలిసి ఇండియా సంప్రదాయ పద్దతిలో ఆవుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Rishi sunak: లండన్‌లో హిందూ సంప్రదాయ పద్దతుల్లో గోపూజ చేసిన రిషి సునక్ దంపతులు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో

Rishi Sunak

Rishi sunak: లండన్‌లో బోరిస్ జాన్సన్ తరువాత ప్రధాని పదవి రేసులో నిలిచిన భారతీయ సంతతి వ్యక్తి రుషి సునక్ ఇటీవల లండన్ లో గోపూజ చేశారు. ఆయన సతీమణి అక్షతా మూర్తితో కలిసి ఇండియా సంప్రదాయ పద్దతిలో ఆవుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

UK PM candidate Rishi Sunak: అసవరమైతే ఓడిపోతా.. కానీ తప్పుడు వాగ్దానాలు చేయను

ఈ వీడియోలో సునక్ తన సతీమణి పక్కన నిలబడి హిందూ సంప్రదాయ పద్దతిలో ఆవుకు హారతి ఇస్తున్నట్లు ఉంది. అంతేకాక ఇత్తడి గిన్నెలో ఆవుకి పవిత్ర జలాన్ని అందజేశారు. అనంతరం భార్యాభర్తలిరువురు పక్కన నిలబడిన పూజారి సూచించిన విధంగా ఆవు నుండి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకొనేందుకు సునక్ తన సతీమణితో కలిసి లండన్ శివారు ప్రాంతంలో భక్తి వేదాంత మనోహర్ ని సందర్శించిన కొన్ని రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది. వేడుకలకు సంబంధించిన ఫొటోలను సునక్ తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు.

లండన్ లో వరుస కుంభకోణాలు, ఇతర కారణాలతో పదుల సంఖ్యలో మంత్రులు రాజీనామా చేయడంతో ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో కన్జర్వేటివ్ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకుంటుంది. ఈ క్రమంలో ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపట్టాలనేది వచ్చే నెలలోగా పార్టీ సభ్యులు నిర్ణయిస్తారు. ప్రధాని పదవికి పోటీలో రిషి సునాక్, లిజ్ ట్రస్ లు తలపడుతున్నారు. అయితే.. పోటీలో ట్రస్ ముందంజలో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బ్రిటీష్ ప్రధానిని నిర్ణయించే కీలకమైన ఓటింగ్ ఫలితం సెప్టెంబర్ 5న వెలువడనుంది.