Whale calf : థేమ్స్ నదిలోకి కొట్టుకొచ్చి చిక్కుకున్న తిమింగలం పిల్ల..ఎన్ని సేవలు చేసిన బతికించలేక..చివరికి..

మింక్ జాతికి చెందిన ఆ తిమింగలం పిల్ల పొరపాటున థేమ్స్ నదిలోకి వచ్చింది. థేమ్స్ నదిలో అది తినటానికి తిండి దొరకదు. తిరిగి సముద్రంలోకి చేర్చాలన్నా అయ్యే పని కాదు. అది అంత తేలిక కాదు. థేమ్స్ నదిలో ఒడ్డుకు దగ్గరగా వచ్చి మేటవేసిన చోట బురదలో చిక్కుకుపోయిన ఆ తిమింగలం పిల్లను కాపాడేందుకు ఇంక వేరే మార్గమేదీ కనిపించలేదు వారికి. కదల్లేక తీవ్ర అస్వస్థతతో అలమటిస్తున్న తిమింగలం పిల్లను చివరకు చేసేదేమీ లేక విషపు ఇంజక్షన్ ఇచ్చి బాధల నుంచి శాశ్వత విముక్తి ప్రసాదించారు.

Whale calf : థేమ్స్ నదిలోకి కొట్టుకొచ్చి చిక్కుకున్న తిమింగలం పిల్ల..ఎన్ని సేవలు చేసిన బతికించలేక..చివరికి..

Whale Cub (1)

Whale calf in London’s thames River : తిమింగలాలు సముద్రాల్లో ఉంటాయనే విషయం తెలిసిందే. సముద్రమంతా మాదే అన్నట్లుగా వీర విహారం చేస్తుంటాయి. వాటి భారీ ఆకారానికి..అవి తినే ఆహారానికి అనంత జలరాశి అయిన సముద్రమే సరిపోతుంది. మహా సముద్రాల్లో తిమింగలాలు చేసే హల్ చల్..సందడి అంతా ఇంతా కాదు. తిమింగలాలు సముద్రాల్లోనే జీవించగలవు. కానీ పాపం 4.5 మీటర్లు పొడువున్న ఓ తిమింగలం పిల్ల పొరపాటున ఓ నదిలోకి కొట్టుకొచ్చి అక్కడే చిక్కుకుపోయింది. పాపం ఆ తిమింగలం పిల్ల. ఎటో వెళ్లాలనుకుని ఇంకెటో వెళ్లిపోయి లండన్ నగరం మధ్య నుంచి ప్రవహించే థేమ్స్ నదిలోకి కొట్టుకువచ్చి అక్కడ ఇరుక్కుపోయింది. సముద్రాల్లో ఉండే తిమింగలం నదిలో కనిపించేసరికి దాన్ని చూడటానికి జనాలు ఎగబడ్డారు. కానీ పాపం అలా థేన్స్ నదిలో చిక్కుకుపోయిన ఆ తిమింగలం పిల్లను కాపాడేందుకు జంతు ప్రేమికులు, పశు వైద్యులు తపించిపోయారు. దాన్ని ఎలాగైనా రక్షించాలనుకున్నారు. దానికి తగిన చర్యలు తీసుకున్నారు. కానీ ఫలితం లేకుండా పోయింది.

మింక్ జాతికి చెందిన ఆ తిమింగలం పిల్ల పొరపాటున థేమ్స్ నదిలోకి వచ్చింది. థేమ్స్ నదిలో అది తినటానికి తిండి దొరకదు. తిరిగి సముద్రంలోకి చేర్చాలన్నా అయ్యే పని కాదు. అది అంత తేలిక కాదు. థేమ్స్ నదిలో ఒడ్డుకు దగ్గరగా వచ్చి మేటవేసిన చోట బురదలో చిక్కుకుపోయిన ఆ తిమింగలం పిల్లను కాపాడేందుకు ఇంక వేరే మార్గమేదీ కనిపించలేదు వారికి. అలా పాపం తిండి లేక..చిక్కుకున్న చోటి నుంచి కదల్లేక తీవ్ర అస్వస్థతతో అలమటిస్తున్న తిమింగలం పిల్లను చివరకు చేసేదేమీ లేక విషపు ఇంజక్షన్ ఇచ్చి బాధల నుంచి శాశ్వత విముక్తి ప్రసాదించారు.

గత ఆదివారం రిచ్‌మాండ్ లాక్స్ వద్ద ఇరుక్కుపోయి కనిపించిందీ తిమింగలం పిల్ల. మేటవేసిన చోట బురదలోంచి అతికష్టం మీద విడిపించగలిగారు. అలా దాన్ని గాలినింపే పడవ మీద అతి కష్టంమీద పడుకోబెట్టగలిగారు. కానీ అది తప్పించుకుని పోయి మరునాడు అంటే సోమవారం ఉదయం టెడ్డింగ్టన్ వద్ద కనిపించింది. అక్కడ తీగల్లో చిక్కుకపోయి కదల్లేని స్థితిలోకి పోయింది.

అప్పటికే పాపం దానికి గాయాలతో బాధపడుతోంది. తీవ్రమైన బాధలో కదలకుండా ఉండిపోయింది. కదిలే పరిస్థితి లేదు. ఈక్రమంలో సోమవారం సాయంత్రం పశువైద్యులు వేరే దాని లేక దాన్ని రక్షించే పరిస్థితి కనిపించక..చివరకు దానికి ఇంజక్షన్‌ ఇచ్చి శాశ్వత నిద్రలోకి పంపించాల్సి వచ్చింది. ఈదురుగాలులు వీస్తున్నా, వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా రెయిలింగ్స్ పట్టుకుని చూస్తుండిపోయిన జనాలు అప్పటి వరకూ దాని కోసం ప్రార్థించి..ఇక ఏమీ చేయలేక బరువెక్కిన గుండెలతో వెనుదిరిగారు.

కాగా..గత మార్చిలో ఒక సీల్ ఈ తిమింగలం పిల్లలాగానే వచ్చి థేమ్స్ లోకి వచ్చింది. వీధికుక్కలు దానిపై దాడి చేయటంతో బాగా గాయాలు అయ్యాయి. దానికి కూడా పశువైద్యుల ఇలాగే ఇంజక్షన్‌ చేసి మరణాన్ని ప్రసాదించాల్సి వచ్చింది. లాక్‌డౌన్ వల్ల బోట్లు తిరగకపోవడమే ఇలా సముద్ర జీవులు నదుల్లోకి కొట్టుకురావడానికి కారణమని అంటున్నారు నిపుణులు.