Israel Palestine: ఇంట్లోకి దూసుకొచ్చిన రాకెట్.. భారతీయ మహిళ మృతి

ఇజ్రాయిల్ - పాలస్తీనా మధ్య బాంబుల వర్షం కురుస్తుంది. మూడు రోజులక్రితం ఇజ్రాయిల్ రాజధాని జెరూసలేంను టార్గెట్ గా చేసుకొని పాలస్తీనాలోని గాజాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు గ్రనేడ్ లాంఛర్లను వదిలారు. వీటిని ఇజ్రాయిల్ భద్రతా సిబ్బంది సమర్థవంతంగా ఎదురుకొని గాలిలోనే పేల్చేశారు. అనంతరం ఇజ్రాయిల్ బలగాలు పాలస్తీనాపై బాంబుల వర్షం కురిపించడం మొదలు పెట్టాయి.

Israel Palestine: ఇంట్లోకి దూసుకొచ్చిన రాకెట్.. భారతీయ మహిళ మృతి

Israel Palestine

Israel Palestine: ఇజ్రాయిల్ – పాలస్తీనా మధ్య బాంబుల వర్షం కురుస్తుంది. మూడు రోజులక్రితం ఇజ్రాయిల్ రాజధాని జెరూసలేంను టార్గెట్ గా చేసుకొని పాలస్తీనాలోని గాజాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు గ్రనేడ్ లాంఛర్లను వదిలారు. వీటిని ఇజ్రాయిల్ భద్రతా సిబ్బంది సమర్థవంతంగా ఎదురుకొని గాలిలోనే పేల్చేశారు. అనంతరం ఇజ్రాయిల్ బలగాలు పాలస్తీనాపై బాంబుల వర్షం కురిపించడం మొదలు పెట్టాయి. గాజాను టార్గెట్ గా చేసుకొని ఇజ్రాయిల్ బీకర దాడులు చేస్తుంది.

ఇజ్రాయిల్ సైన్యం, ఉగ్రవాదులకు జరుగుతున్న దాడిలో ఇప్పటివరకు 28 మంది మృతి చెందగా వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. మృతిచెందిన 28 మందిలో 16 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. మరో 12 మంది పౌరులు మృతి చెందినట్లు పేర్కొంది. కాగా ఈ దాడుల్లో భారత్ కు చెందిన ఓ మహిళ మృతి చెందారు. కేరళ రాష్ట్రము ఇడుక్కి జిల్లా కీరితోడుకు చెందిన ఎంఎస్ సౌమ్య ఏడేళ్లుగా ఇజ్రాయెల్‌ అష్కెలోన్ నగరంలో పని మనిషిగా చేస్తోంది.

అష్కెలోన్ నగరంలోని తన ఇంట్లో ఉన్న సౌమ్య భర్తతో వీడియో కాల్ మాట్లాడుతుండగా హమాస్ ఉగ్రవాదులు విసిరిన రాకెట్ వచ్చి ఆమె ఇంట్లో పడి పేలింది. దింతో సౌమ్య అక్కడికక్కడే మృతి చెందింది. వీడియో కాల్ ఒక్కసారిగా బ్లాక్ వచ్చింది.. వెంటనే కట్ అయింది. కొద్దీ సేపటి తర్వాత తిరిగి ప్రయత్నించినా ఫోన్ కనెక్ట్ కాకపోవడంతో ఆమె స్నేహితులకు ఫోన్ చేశారు. వారు సౌమ్య రాకెట్ దాడిలో మృతి చెందినట్లు తెలిపారు. ఇక సౌమ్య మృతిని ఇజ్రాయిల్ మీడియా ధ్రువీకరించింది.